బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మిడిల్ స్కూల్ వెనుకాల మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఘర్సేని గ్రామానికి చెందిన సర్వీస్ సింగ్ (55)గా గుర్తించారు.
Read Also: Pollution: షాకింగ్ న్యూస్.. కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!
నిందితులు అతని శరీరాన్ని యాసిడ్‌తో కాల్చడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా.. మృతుడి ఒక కన్ను పీకేశారని కియోటి పోలీస్ స్టేషన్ ఇంఛార్జి చెప్పారు. మృతుడు గత ఆరు నెలలుగా జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని టాటానగర్‌లో నివసిస్తున్నాడు. తల్లి చనిపోవడంతో శ్రద్ధా కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం ఇంటికి వచ్చాడు. అనంతరం.. మధ్యాహ్నం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. కాగా.. మృతుడిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి గ్రామంలోని పాఠశాల సమీపంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: IND vs BAN: ముగిసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్.. భారీ ఆధిక్యంలో భారత్