అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన పెన్షన్ల గుర్తించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం వేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. కొందరు అనర్హులు కూడా సామాజిక పెన్షన్లు తీసుకొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వ్యక్తులు రూ. 15 వేల మేర వికలాంగ పెన్షన్ తీసుకొంటున్నారని తెలిపారు.
Read Also: RBI: ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌కు ఊరట.. గోల్డ్ లోన్ బిజినెస్‌పై ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేత
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామిక వేత్తలుగా మార్చాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం అని మంత్రి చెప్పారు. 10 జిల్లాల్లో ఎస్పీవీలు ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.. గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా రూ.42 కోట్ల విడుదల తద్వారా రూ.512 కోట్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారని అన్నారు.
Read Also: Israel-Lebanon war: లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడులు
గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు చెందిన స్త్రీనిధి బ్యాంకు నుంచి గత ప్రభుత్వం రూ.950 కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు రూ.500 కోట్లు పీడీ ఖాతాలకు మార్చేసి స్త్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచారని ఆరోపించారు. రూ.2100 కోట్లు అభయహస్తం నిధుల్ని కూడా గత ప్రభుత్వం కాజేసింది.. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.