పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది. దాడి అనంతరం పాక్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
Read Also: Delhi metro: మెట్రో రైల్వేట్రాక్‌పై వ్యక్తి హల్‌చల్.. 20 నిమిషాలు నిలిచిన ఢిల్లీ మెట్రో సేవలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి ఈ దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని లాధా తహసీల్‌లోని మిష్టా గ్రామంలోని భద్రతా పోస్ట్‌పై టిటిపి ఉగ్రవాదుల బృందం దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ప్రాంతంలో టీటీపీ.. ఇంతకుముందు కూడా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం దక్షిణ వజీరిస్థాన్‌లోని వార్సాక్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు మరణించగా, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
Read Also: IND vs BAN: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..?
కాగా.. ఆఫ్ఘనిస్తాన్ టీటీపీకి ఆశ్రయం ఇస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం నిరంతరం ఆరోపిస్తూనే ఉంది. దానిని.. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. 2021లో కాబూల్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పాకిస్థాన్‌లో తీవ్రవాద ఘటనలు పెరిగాయి. ఈ కారణంగా.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం సహాయం చేస్తుందనే దాని ఆశలను ఇస్లామాబాద్ దెబ్బతీసింది. ఈ ఉగ్రవాద ఘటనల కారణంగా ఇటీవల ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. దీనికి ప్రధాన కారణం టీటీపీ. సరిహద్దుల్లో టీటీపీ, పాకిస్థాన్ ఆర్మీ మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. టీటీపీ అనేక తీవ్రవాద సంస్థల సమ్మేళనంగా 2007లో స్థాపించబడింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిషేధిత సంస్థను “ఫిత్నా అల్-ఖవారీజ్”గా అధికారికంగా ప్రకటించింది.