XEC Covid Variant: కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. దీని లక్షణాలు ఏమిటి..?
- కలవరపెడుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ XEC
- యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ కేసుల పెరుగుదల
- త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ కొత్త వేరియంట్ XEC కలవరపెడుతోంది. యూరోపియన్ దేశాలలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదల అధికంగా నమోదవుతోంది. పలు దేశాల్లో కరోనావైరస్ కొత్త వేరియంట్ XEC కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. కోవిడ్19 XEC వేరియంట్‌ను తొలిసారిగా జర్మనీలో గుర్తించారు. ఈ వేరియంట్ లక్షణాలు మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉంటాయని, ఇది గతంతో పోలిస్తే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండటంతోపాటు.. ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Read Also: YS Jagan: శ్రీవారి లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
XEC వేరియంట్ ఆందోళనలను పెంచుతోంది:
కొత్త వేరియంట్ కేసులు UK, US, డెన్మార్క్.. అనేక ఇతర దేశాలలో నమోదవుతున్నాయి. కోవిడ్ యొక్క ఈ వేరియంట్ మరింత అంటువ్యాధి కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాలిఫోర్నియాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్, శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ టోపోల్ మాట్లాడుతూ.. ఈ కొత్త వేరియంట్ ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్నారు. ఆగస్టు నెలలో.. అనేక యూరోపియన్ దేశాలలో ఈ వేరియంట్‌తో సంక్రమణ రేటు చాలా ఎక్కువగా కనిపించిందని.. కోవిడ్ కేసుల నమూనాలలో 10 శాతానికి పైగా ఈ కొత్త వేరియంట్ కనుగొన్నారని తెలిపారు.
XEC అనేది హైబ్రిడ్ వేరియంట్:
ప్రాథమిక అధ్యయనాల ఆధారంగా.. XEC ఒక హైబ్రిడ్ వేరియంట్ అని పరిశోధకులు తెలిపారు. ఇది ఒమిక్రాన్ యొక్క కొత్త ఉప-వేరియంట్. ఇది గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది మునుపటి KS.1.1, KP.3.3 వేరియంట్‌ల మిశ్రమ రూపం అని అంటున్నారు. రెండు వేర్వేరు వైవిధ్యాల కలయిక కారణంగా.. దాని ఇన్ఫెక్టివిటీ రేటు బహుశా ఎక్కువగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది:
రెండు మూడు నెలల్లోనే XEC వేరియంట్ 27 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్ కేసులు చాలా వరకు ప్రధానంగా ఐరోపాలో గుర్తించారు. సెప్టెంబర్ 3 నాటికి USలో 23 XEC కేసులు గుర్తించారు. డెన్మార్క్, జర్మనీలలో కూడా కనుగొన్నారు. కొత్త వేరియంట్ యొక్క ఇన్ఫెక్టివిటీ రేటు చాలా ఎక్కువగా ఉండవచ్చని ఈ కేసులు సూచిస్తున్నాయి.
లక్షణాలు:
ఈ రూపాంతరం కారణంగా వ్యాధి లక్షణాలలో ఇంతవరకు గణనీయమైన మార్పు కనిపించలేదు. ప్రస్తుతం దీని లక్షణాలు మునుపటి కోవిడ్ వేరియంట్‌ల మాదిరిగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి సోకిన వారిలో చాలా మందికి జ్వరం, గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం లేదా ముక్కు కారడం, దగ్గు, వాసన కోల్పోవడం, వికారం లేదా వాంతులు, ఆకలి లేకపోవడం, శరీర నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!