Health Tips: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
- కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది
- కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటాయి. ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని సైతం ఈ గింజలు పెంపొందిస్తాయి. కలోంజి గింజలు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.
Good News: సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధం:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కలోంజి గింజల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మద్యపానంతో పాటు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారు రాత్రిపూట నీటిలో రెండు చెంచాల కలోంజి గింజలను నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
గుండెకు మంచిది:
కలోంజి గింజల నీరు గుండెకు చాలా మంచిది. ఇందులో తగినంత పొటాషియం ఉంటుంది. ఇది గుండె బలానికి చాలా ముఖ్యమైనది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కలోంజి గింజల వాటర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే వ్యాధులను చాలా వరకు నివారించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడంతో పాటు మెరిసే చర్మానికి ప్రభావవంతం:
బరువు పెరగడం అనే సమస్య ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. పెరిగిన బరువును కలోంజి గింజల వాటర్‌తో తగ్గించుకోవచ్చు. ఇందులో.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కలోంజి గింజల నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. అంతేకాకుండా.. జీవక్రియను పెంచడంలో చాలా సహాయపడుతుంది. మంచి ఆహారం, తేలికపాటి వ్యాయామంతో పాటు కలోంజి గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. అలాగే.. చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కలోంజి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
కడుపు సంబంధిత వ్యాధులకు ఉపయోగించండి:
కడుపు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో కలోంజి గింజల నీరు చాలా సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం లేదా అసిడిటీ సమస్య ఉంటే.. కలోంజి గింజల నీరు చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇది అన్ని కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!