Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. డబుల్ గోల్డ్
- చెస్ ఒలింపియాడ్ 2024లో చరిత్ర సృష్టించిన భారత్
- తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఇండియా
- ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ తొలి బంగారు పతకం
- మహిళల జట్టు కూడా మరో స్వర్ణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళల జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది. 45వ ఫిడే (FIDE) పోటీల్లో భారత ప్లేయర్లు డీ గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, విడిత్ గుజరాతి, పెంటల హరికృష్ణ, శ్రీనాథ్ నారాయన్ వారి గేమ్ లలో సత్తా చాటడంతో భారత పురుషుల జట్టు గోల్డో మెడల్ గెలుచుకుంది. రష్యా ఆటగాడు వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై డీ గుకేశ్ విక్టరీ సాధించడంతో దేశానికి గోల్డ్ మెడల్ అందించాడు.
Read Also: Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
బుడాపెస్ట్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత మహిళల జట్టు బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. హారిక ద్రోణవల్లి, ఆర్ వైశాలి, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్‌లతో కూడిన భారత మహిళల చెస్ జట్టు గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడంతో భారత్ రెండో స్వర్ణం అందుకుంది. కజకిస్థాన్‌ను అమెరికా ఓడించడంపైనే ఓపెన్ విభాగంలో భారత జట్టు విజయం ఆధారపడి ఉంది. ఆదివారం అమెరికా తన ప్రత్యర్థిని 1-1తో డ్రా చేయడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు.
Read Also: Devara Latest Update: స్టేజ్ మీద బారికేడ్లు.. ఎన్టీఆర్ తో మాట్లాడించే యత్నం?
అంతకుముందు శుక్రవారం (సెప్టెంబర్ 20) భారత పురుషుల జట్టు ఇరాన్‌పై 3.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి ఓపెన్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసింది. కాగా.. భారత పురుషుల జట్టు 2014 ఎడిషన్‌లో కాంస్యం, 2022లో కాంస్యం గెలుచుకుంది.
👏SUPER NEWS: 🇮🇳 India clinched gold at the the 2024 FIDE Chess Olympiad in the open section! 🥇
Congratulations to @DGukesh, @rpraggnachess, @ArjunErigaisi, @viditchess, @HariChess, @srinathchess (c) and the members involved!
🇮🇳 INDIA OP! pic.twitter.com/ycruqMqRZo
— Chess.com – India (@chesscom_in) September 22, 2024
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!