పోలీసు అమరవీరుల దినోత్సవం, గణపతి నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నభి ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటి వరకూ ఎండ కొట్టినప్పటికీ, ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. గత మూడు రోజులుగా రోజు సాయంత్రం కాగానే కుండపోత వాన పడుతుంది. కేవలం నగరంలోనే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌ది అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో.. పదేళ్లలో పార్టీ ఫిరాయింపుల కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నువ్వు నీతులు చెప్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ రోజు అధికార నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ కోరారు. అదే విధంగా.. నియోజకవర్గంలోని 7 రోడ్లకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ స్కీమ్ (CRIF) పరిధిలో నిధులను మంజూరు చేసి నిధులను విడుదల చేయాలని స్పీకర్…
సోమవారం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'లో ప్రధాని మోడీ మాట్లాడుతూ.., 'మానవత్వం యొక్క విజయం మన సమిష్టి శక్తిలో ఉంది, యుద్ధభూమిలో కాదు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ప్రపంచ సంస్థలలో సంస్కరణలు చాలా ముఖ్యమైనవి. ఔచిత్యానికి మెరుగుదల కీలకం' అని అన్నారు.
నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే ఓ మహిళ నిద్ర పోయి రూ. 9 లక్షలు గెలుచుకుంది.