Dissanayake: ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఏకీభవిస్తున్నా..
- శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా- దిసానాయకే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనుర కుమార దిసానాయకేకి ప్రధాని నరేంద్ర మోడీ ‘X’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో.. సోమవారం దిసానాయక్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రధాని మోడీ, మీ మనోహరమైన మాటలు, మద్దతు కోసం నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.’ అని మోడీ పంపిన మెస్సెజ్‌కు రిప్లై ఇచ్చారు. మన దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై మీ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. మన ప్రజల ప్రయోజనం, శాంతి కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా మనం కలిసి పనిచేయగలమని దిసానాయకే అన్నారు.
భారతదేశం, శ్రీలంక మధ్య బహుళ కోణాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి.. కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని గతంలో ప్రధాని మోడీ ‘X’ లో పోస్ట్ చేసారు. ‘భారతదేశం యొక్క నైబర్ ఫస్ట్ పాలసీ, విజన్ సాగర్‌లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉంది. మా ప్రజల, మొత్తం ప్రాంత ప్రయోజనాల కోసం మా బహుముఖ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో సన్నిహితంగా పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని ప్రధాని మోడీ అన్నారు.
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
Pawan Kalyan: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..
ఉద్యమం తర్వాత జరిగిన ఎన్నికల్లో శ్రీలంక ప్రజలు అధ్యక్ష పదవికి జనతా విముక్తి పెరమున పార్టీ నాయకుడు దిసానాయక్‌ను ఎన్నుకున్నారు. సోమవారం ఆయన శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన సాజిత్ ప్రేమదాస, డిసానాయకేలను అనుర కుమార ఓడించారు. ఆర్థిక సంక్షోభానికి ముందు దేశ రాజకీయాలను ఏకపక్షంగా నియంత్రించిన రాజపక్సే కుటుంబం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లో మహిదా రాజపక్సే కుమారుడు నాలుగో స్థానంలో నిలిచారు.
56 ఏళ్ల మార్క్సిస్ట్ నాయకుడు దిసానాయక పార్టీకి గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దేశంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజలకు నాయకత్వం వహించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఆర్థిక సంక్షోభం సమయంలో దేశాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్న రణిల్ విక్రమసింఘే ప్రభుత్వ విధానాలను కూడా ఆయన వ్యతిరేకించారు. ప్రజలపై విధించిన భారీ పన్నులకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమించారు. దేశంలోని సమస్యలన్నీ ఒక్క దెబ్బతో ముగిసిపోతాయన్న మాంత్రికుడిని కానప్పటికీ, అందరితో కలిసి ఈ సమస్యలను ఎదుర్కొంటానని దిసానాయక్ తెలిపారు.
Mpox Clade 1: భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం.. Mpox క్లాడ్ 1B కేసు నమోదు
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!