కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. తనతో పాటు కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే పాల్గొన్నారు. ఈ క్రమంలో తనను ఉద్దేశించి సరదాగా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్డీయే నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న గ్యారెంటీ లేదని.. కానీ రాందాస్ అథవాలే మంత్రి కావడం ఖాయమని గడ్కరీ అన్నారు. అయితే.. ఇదంతా తాను సరదాగానే చెప్తున్నాననీ.. సీరియస్‌గా మాత్రం తీసుకోవద్దని అన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రముఖ, శక్తిమంతమైన నాయకుడు రాందాస్ ఇప్పటి వరకు మూడు ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో మంత్రి పదవిని నిర్వహించడం గమనార్హం.
Read Also: Bee Attack: తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..
అంతకుముందు రాందాస్ అథవాలే మాట్లాడుతూ.. వచ్చేసారి కూడా మంత్రి పదవికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా.. రామ్ విలాస్ పాశ్వాన్ విషయంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలాగే మాట్లాడేవారని గడ్కరీ గుర్తు చేశారు. “రాందాస్ అథవాలేకు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతనికి మంచి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. దళితులు, అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారు” అని అన్నారు.
Read Also: Snake bite: పాముకాటుతో యువకుడు మృతి.. అతని చితిపై పామును సజీవ దహనం
అథవాలే RPI(A) పార్టీ మహారాష్ట్రలో మహా కూటమి ప్రభుత్వంలో భాగం. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని అథవాలే తెలిపారు. “ఆర్‌పిఐ (ఎ) పార్టీ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తుంది. విదర్భలో నార్త్ నాగ్‌పూర్, ఉమ్రెడ్ (నాగ్‌పూర్), ఉమర్కర్, వసీమ్‌లతో సహా 3-4 స్థానాలను పార్టీ కోరనుంది” అని తెలిపారు. ఈ కూటమిలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలు ఉండటం గమనార్హం.