కంగనా రనౌత్ సినిమా 'ఎమర్జెన్సీ' విడుదలపై నిషేధం విధించడంపై బాంబే హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. ఈ చిత్రాన్ని విడుదల చేయవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తెలిపింది. అయితే.. సెన్సార్ బోర్డ్ రివ్యూ కమిటీ సూచనల మేరకు సినిమాలో కొన్ని కట్స్ చేయాల్సి ఉంటుంది.
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన పర్యావరణ విపత్తుపై వర్క్‌షాప్ నిర్వహించారు. విపత్తు జరిగిన రోజు అక్కడ విపరీతమైన గాలులు, భారీ వర్షం ఒకే చోట కురవడం వలన కేవలం ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం జరిగింది. NRSC, NARLకి చెందిన శాస్త్రవేత్తలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి వాయుగుండం సంభవించడం వలన ఇక్కడ గంటకు 130-140 కిలోమీటర్లు వేగంతో గాలి వీచిందని చెబుతున్నారు.
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం అందించింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. కాగా.. ఆ ఇంటి స్థలం ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగిలయ్యకు అందజేశారు. మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ కూడా ఉన్నారు. కాగా.. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.
డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు సర్టిఫికెట్ పరిశీలన జరుగనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న రైతు హామీల సాధన కోసం దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు అరటి తోటలో పనికి వెళ్ళారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై పిడుగు పడింది. దీంతో.. పిడుగుపాటుకు గురై సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (19) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
పవన్ కల్యాణ్‌కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్‌లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు.