విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్‌లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. గన్నవరం పోలీసులు నమోదు చేసిన మైనింగ్ కేసుల్లో 41ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వంశీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్‌ను గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు కలిశారు. దాదాపు 400 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ బహిష్కరణ వేటు వేశారు. బహిష్కరించిన వారిలో అన్ని కుటుంబాలు మైనారిటీ, ఎస్సీ, బీసీలకు చెందినవే ఉన్నాయి. కాగా.. వచ్చే రెండు నెలల్లో ఛలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది. ఈ క్రమంలో.. గ్రామ బహిష్కరణ విషయంపై […]
రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు.. తాము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల కానున్నాయి. మరికాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేయనుంది. అలాగే.. టాపర్స్ లిస్ట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి బోటనీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్ష పేపర్లలో తప్పులు దొర్లాయి. బోటనీ, మ్యాథ్స్ పేపర్‌లలో చిన్నచిన్న తప్పులు జరిగినట్టుగా గుర్తించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.