Jishnudev Varma: నేడు ములుగు జిల్లాలో గవర్నర్ పర్యటన.. దత్తత గ్రామానికి జిష్ణుదేవ్ వర్మ
- నేడు ములుగు జిల్లాకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- దత్తత గ్రామం కొండపర్తికి రానున్న గవర్నర్
- అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
- గ్రామస్థులతో సమావేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి రానున్నారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం.. గ్రామస్థులతో సమావేశమై సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకోనున్నారు. కాగా.. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతేడాది ఆగస్టులో ములుగు పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్రమంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తికి స్పందించి తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ ఊరి అభివృద్ధికి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో కేవలం 79 గడపలు, 370 జనాభా కలిగిన అటవీ గ్రామమైన కొండపర్తి రూపు రేఖలు మారిపోయాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీలకు నూతన భవనాలు నిర్మించారు. డిజిటల్ బోధనను అమలు చేస్తున్నారు. మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మసాలా తయారీ, టైలరింగ్, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివాసీ రైతుల వ్యవ సాయ అవసరాల కోసం బోరు మోటారును అందుబాటులోకి తెచ్చారు. మరుగుదొడ్లు, అంతర్గత రోడ్లు, తాగునీటి వసతిని మెరుగుపర్చారు. సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. అందరికీ ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇండ్లను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఈ పనులు పూర్తికావడంతో మంగళవారం గవర్నర్ వాటిని ప్రారంభించేందుకు అడవిపల్లె కొండపర్తికి వస్తున్నారు. వాటి ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం గ్రామస్తులతో సమావేశమవుతారు.
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
Read Also: Tragedy: హబ్సిగూడలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
గవర్నర్ పర్యటన షెడ్యూల్..
గవర్నర్ ములుగు జిల్లా పర్యటన షెడ్యూల్‌నుయ అధికారులు విడుదల చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డుమార్గాన బయలు దేరి 10:30 గంటలకు ములుగుకు చేరుకుంటారు. గట్టమ్మ సమీపంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో కొద్దిసేపు సేద తీరుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి 11:15 గంటలకు తాడ్వాయి మండలం కొండపర్తికి చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత గ్రామస్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:45 గంటలకు మేడారం వెళ్తారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. స్థానిక ఐటీడీఏ అతిథి గృహంలో భోజనం చేసిన తర్వాత 2:30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?