ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలు ముస్సోరీలో జరుగుతున్నాయి. బుధవారం, గురువారం రెండ్రోజులుగా ఐటీసీ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సతీసమేతంగా కలిసి వచ్చాడు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్లు వేసిన వారిలో కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు ఏకగ్రీవం అయ్యారు. అలాగే.. బీజేపీ నుంచి సోము వీర్రాజు, జనసేన నుంచి నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటి వరకు ఉండేది.. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ వరంగల్‌లో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించింది. కాగా.. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో డయాలసిస్ క్లినిక్స్ దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.