ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతుంది. ఈరోజు రోబోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇప్పటికే టన్నెల్‌లోకి అన్వీ రోబో బృందం వెళ్లింది. డేంజర్ జోన్‌లో రోబోలతో తవ్వే ప్రయత్నం చేశారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు చోట్ల తవ్వకాలు మొదలు పెట్టారు. కాగా.. సాయంత్రానికి రెండు మృతదేహాలు వెలికితీసే అవకాశం ఉంది. కేరళకు చెందిన క్యాడవర్ శునకాలు మృతదేహాల ఆనవాళ్లు పసిగట్టాయి. దాంతో ఆ ప్రాంతంలో తవ్వితే ఒకరి మృతదేహం బయటకు తీశారు. అతి కష్టం మీద మరో ఐదడుగులు తవ్వారు. ఇంజనీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటు ఇటుగా మరో ముగ్గురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉంది. మిగిలిన వారు సొరంగం చిట్ట చివరి భాగం దగ్గర టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం టన్నెల్‌లో టీబీఎం మిషన్ కట్టింగ్, డీ వాటరింగ్ కొనసాగుతుంది.
Read Also: Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) టన్నెల్ నిర్మాణ సమయంలో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ (GPR), క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు. ఆదివారం నాడు డీ2 ప్రాంతంలో తవ్వకాలు జరిపిన రెస్క్యూ టీమ్స్ ఓ ఇంజనీర్ మృతదేహాన్ని వెలికితీశాయి. రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.