హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని ఇద్దరిని చంపి లెక్చరర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇరు కుటుంబాలకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నట్లు దంపతులు తెలిపారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. మేము చనిపోతే పిల్లలు అందరికీ భారం అవుతారని చంపేస్తున్నట్లు దంపతులు తెలిపారు.
Read Also: IT Raids: శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటీ సోదాలు..
ఫ్యామిలీ సూసైడ్ నోట్‌లో భార్యాభర్తలు చంద్రశేఖర్ రెడ్డి, కవిత ఏం రాశారంటే..?
చంద్రశేఖర్:
కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశాను.. 2019లో ఉద్యోగం నుండి బయటకు వచ్చేశాను.. రెండేళ్ల పాటు ఊర్లో వ్యవసాయం చేశానని చంద్రశేఖర్ తెలిపారు. కానీ వ్యవసాయంలో ఆశించినంత ఆర్థికంగా స్థిరపడలేకపోయాము.. కుటుంబ పోషణ కోసం అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడేందుకు ప్రయత్నం చేశాము.. కానీ సాధ్యం కాలేదన్నారు. దీంతో.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను.. ఆత్మ అభిమానం, ఆత్మగౌరవంతో ఇతరులను సహాయం అడగలేదని తెలిపారు. వేరే పని చేయలేకపోయాను.. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. అమ్మా, నాన్న, అన్న మమ్మల్ని క్షమించండి అంటూ లేఖలో రాశాడు.
కవిత:
అమ్మా, నాన్న క్షమించండి.. అమ్మ బంగారం ముత్తూట్‌లో ఉంది.. అది విడిపించి అమ్మకు ఇవ్వండి. మమ్మల్ని ఊరికి తీసుకొని వెళ్ళండి.. ఇంట్లో సామాన్లు అందరికి పంచండని లేఖలో రాసింది.