దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో చైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యాసంస్థల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
Read Also: Inter Exam: ఇంటర్ పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ప్రశ్నలు.. ప్రభుత్వ తీరుపై బీజేపీ ఫైర్
పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. విద్యార్థుల నుంచి విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని టాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు జరిపిన కాలేజీ యాజమాన్యం.. ప్రభుత్వానికి కట్టే టాక్స్ కోసం మరొక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Nothing Phone 3a: భారీ డిస్కౌంట్తో నేటి నుంచి అమ్మకాలు షురూ చేయనున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్