ప్రభుత్వంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలిలో ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాలలో ప్రభుత్వం నుంచి నిర్దిష్ట సమాధానాలు రావటం లేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై మాట్లాడాలని అన్నారు.. తాము 2014 నుంచి మాట్లాడాలని అడిగామని పేర్కొన్నారు. అమరావతి భూములు, స్కిల్ స్కాంలు, అగ్రిగోల్డ్ దందాలు అన్నీ విచారణ చేయాలని అడిగామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. మాజీ ముఖ్యమంత్రిని భూ బకాసురుడు అని మాట్లాడటం సరికాదని చెప్పామని బొత్స పేర్కొన్నారు. విశాఖ సిట్ విచారణపై రిపోర్టులు బయట పెట్టాలని అడిగాం.. నిరాధార ఆరోపణలు చేయటం సరికాదని చెప్పామని ఆయన తెలిపారు.
Read Also: World Kidney Day: ఆరోగ్యంగా ఉండాలంటే మూత్రపిండాల రక్షణ తప్పనిసరి
ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ఆలోచన లేదు.. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న అధికారులపై కూడా విచారణ చేయమని కోరుతున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వానికి దశ, దిశా లేదని దుయ్యబట్టారు. ఎదుటి వాళ్ళను అవమానపరచాలన్న ఆలోచన తప్ప మరొకటి కనిపించలేదని ఆరోపించారు. 2019 నుంచి జరిగిన స్కాంలపై విచారణ చేసుకోమని చెప్పాం.. డిజిటల్ కరెన్సీపై మాట్లాడారు.. అది సరైనది కాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలు తాము ఖండించడం లేదు.. సమర్ధించడం లేదన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని కోరుతున్నామని వెల్లడించారు బొత్స సత్యనారాయణ.
Read Also: Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్..
ప్రభుత్వం మనుషుల మీద బురద చల్లాలని చూస్తున్నారని బొత్స పేర్కొన్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు.. కొన్నిసార్లు అలవాటులో జరుగుతుంది.. ప్రత్యేకంగా మాట్లాడితే సంప్రదాయం కాదని చెప్పామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు.. అమరావతిలో జరిగింది భూ స్కాం అని ఆరోపించారు. ఏ చర్చ జరిగినా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అర్థం లేని ఆరోపణలు చేస్తే తాము సమాధానాలు చెప్పలేమన్నారు. వైసీపీ మీద, తమ నాయకుడు మీద బురద చల్లాలని ఆరోపణలు చేశారు కాబట్టే.. తాము సభ నుంచి వాకౌట్ చేశామని బొత్స సత్యనారాయణ తెలిపారు.