Results: నేడు గ్రూప్-2 ఫలితాలు.. కాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటన
- కాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించనున్న టీజీపీఎస్సీ
- 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్
- గ్రూప్-2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు
- పలుమార్లు వాయిదా పడ్డ గ్రూప్-2 పరీక్ష
- గత డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన పరీక్ష.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు గ్రూప్-2 ఫలితాలు విడుదల కానున్నాయి. మరికాసేపట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ (TGPSC) ప్రకటించనుంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ ‘కీ’ ని కూడా విడుదల చేయనుంది. అలాగే.. టాపర్స్ లిస్ట్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాగా.. గ్రూప్-2లో మొత్తం 783 పోస్ట్‌ల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. గ్రూప్- 2 పరీక్షకు 5 లక్షల 51 వేల 855 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ పరీక్ష పలుమార్లు వాయిదా పడగా.. గత డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2 లక్షల 51 వేల 738 (45.57 శాతం) మంది హాజరు అయ్యారు. ఈ క్రమంలో.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది టీజీపీఎస్సీ.
Read Also: Nidhhi Agerwal : నిధులున్నా కూడా ఆఫర్లు అంతంత మాత్రమే
Also Read
కాగా.. సోమవారం గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టులకు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. కాగా.. మార్చి 14వ తేదీన గ్రూప్-3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!