ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు, కూతుళ్లు ఉన్నారు. తమను నవమాసాలు కడుపులో మోసి.. పెంచి పెద్ద చేశాక ఆస్తుల కోసం పక్కన పెడుతున్నారు. చనిపోయాక ఏముంటుంది.. ఏం ఆస్తులు, డబ్బులు తీసుకెళ్లలేము కదా. అదే మనల్ని కన్న తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటే ఏమవుతుంది. ఈరోజుల్లో ఆస్తి కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన ఘటనలు కూడా చూశాం.
Read Also: Minister Anitha: ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు.. దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో కూడా అలాంటి మాదిరి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి ఐదు రోజులుగా అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. ఈ ఘటన సదాశివపేట (మం) తంగేడుపల్లిలో జరిగింది. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అన్న దానికి ఇదే నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే, తన భర్త ఐదు రోజుల క్రితం చనిపోయాడు. అయితే.. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కోసం భర్త మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు ఓ భార్య.. కాగా, తల్లిదండ్రులు ఆస్తిని మొత్తం తన బావ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మనస్తాపంతో ఈ నెల 18న భర్త రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సదాశివపేట ఆస్పత్రి మార్చురీలోనే ఉంది మృతదేహం. భార్య బంధువులు ఆస్తిలో వాటా ఇవ్వాలని నిలదీయగా ముందు ఒప్పుకొని తర్వాత పరారయ్యాడు అల్లుడు మల్లేశం.. అతను కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఐదు రోజులుగా పోలీసులు మల్లేశంని రహస్య ప్రదేశంలో దాచిపెట్టారని మృతుడి భార్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Hydrogen Train : భారత్‌లో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..