ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఎల్లుండి (బుధవారం) ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. వయనాడ్‌లో పెద్ద ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొననున్నారు.
ఢిల్లీలో గాలి కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలో.. రెండవ దశ GRAP (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) అమలు చేశారు. సోమవారం సాయంత్రం సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఏర్పాటు చేసిన గ్రేప్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GRAP యొక్క రెండవ దశలో ఉన్న ఆంక్షలలో పార్కింగ్ రేట్లను పెంచడం, మెట్రో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచడం వంటి నిబంధనలు ఉన్నాయి.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఫోన్ చేస్తానని బెదిరిస్తూ నైట్ పెట్రోలింగ్ పోలీసులను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చెన్నైకి చెందిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.
న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ 'ది ఇండియా సెంచరీ' గురించి మాట్లాడారు. ఇంటరాక్షన్ సందర్భంగా భారతదేశ విదేశాంగ విధానం, ప్రపంచవ్యాప్త పాత్రను ఎలా పోషిస్తోంది అనే దానిపై వివరాలను వెల్లడించారు. రష్యాతో భారత్ సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు రష్యా వెళ్తున్నారని తెలిపారు.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఇటీవల 8 ఔషధాల ధరలను 50 శాతం పెంచడానికి ఆమోదించింది. ఈ ఎనిమిది నిత్యావసర ఔషధాల ధరల పెంపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఔషధాల ధరల నిర్ణయంపై పునరాలోచించాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పౌరుల సంక్షేమమే ప్రధానమని లేఖలో మమత ఉద్ఘాటించారు.
రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించి జట్టు స్కోరును పెంచాడు.
ఎవరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్న తర్వాత విడిపోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ.. విడిపోతే ఆ బాధ తమ మనస్సు, హృదయం నుండి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే.. కొందరు విడిపోయిన వెంటనే మరో లైఫ్ లోకి ప్రవేశించి జీవితం గడుపుతారు.
మనిషిగా పుట్టినవారు చావక తప్పదు.. చనిపోయిన తర్వాత మృదదేహాన్ని కాల్చేసి.. ఆ బూడిదను పవిత్ర జలాల్లో కలుపుతారు. ఈ సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది.. కానీ, మనిషి చితాభస్మంతో కోట్లలో సంపాదిస్తున్నారంటే నమ్ముతారా..? అవును మీరు వింటున్నది నిజమే జపాన్ ప్రభుత్వం మనిషి బూడిదతో వందల కోట్లలో సంపాదిస్తుంది.