Telangana: తెలంగాణలో రోడ్డెక్కిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలు.. ఎందుకంటే..?
- రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు
- భర్తల కోసం పోలీస్ బెటాలియన్ల ఎదుట ధర్నా చేసిన భార్యలు
- ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్ విధానం కావాలంటూ డిమాండ్
- బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. బెటాలియన్ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న భర్తల కోసం భార్యలు ధర్నాకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. టీజీఎస్పీ హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాలను తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 గంటలకు మించి బెటాలియన్ కానిస్టేబుళ్లకు డ్యూటీ వేస్తుండటాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.
నెలలో నాలుగు రోజులు మాత్రమే సెలవు ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తమ భర్తలతో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వాపోయారు. తరచూ పోస్టింగులు మారుస్తూ ఉండటంతో పిల్లల చదువులకు ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. తమ సమస్యలు పరిష్కారించాలని కానిస్టేబుళ్ల సతీమణులు ధర్నాకు దిగారు. డిచ్‌పల్లి, హాజీపూర్, సిరిసిల్లలో ఆందోళన చేసిన కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
Read Also: Underwater Wedding: సాహసోపేత వివాహం.. ఏకంగా సముద్రం అడుగున జంట పెళ్లి..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు.. బెటాలియన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నా చేశారు. 8 గంటలకు మించి కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తుండటంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ పోలీసులకు ఐదేళ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్ ఎదుట ఆందోళన చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యల ధర్నా చూసి.. అదే మార్గంలో వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆగారు. ఆందోళనకారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా.. వారి ధర్నాకు మద్దతు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు రోడ్డెక్కారు. హాజీపూర్ మండలం గుడిపేట టీజీఎస్పీ 13వ పోలీస్ పటాలంలో పని చేసే పోలీసుల భార్యలు రాస్తారోకో చేపట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమ భర్తలు ఇంటికి దూరంగా ఉంటున్నారని… నెలలో నాలుగు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని వాపోయారు. ఉద్యోగాల పేరుతో తమకు దూరం చేస్తున్నారని.. ఇకనైనా ఒక రాష్ట్రం, ఒక పోలీస్ విధానం అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?