కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ర్యాగింగ్ పై విచారణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ చేత విచారణ జరిపించాలని ఎన్ ఎం సి ఆదేశించింది.
నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. బందరు రోడ్డులో ఉన్న వివంతా హోటల్‌కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ క్రమంలో.. తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏమీ లేదని గుర్తించారు.
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన పలువురు ఐఏఎస్ (IAS)లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అందులో.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనరుగా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శి (GPM & PR)గా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది.
తమిళ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండి వి సాలై గ్రామంలో జరిగిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్ రాధ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హ్యాలీడే కొట్టిన షాట్‌ను వెనక్కి పరిగెత్తుతూ గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టింది. ఇటు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అదరగొట్టింది. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 69 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది.
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసినట్లు సమాచారం. అయితే.. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టెస్టుకు మాత్రమేనా, లేదా పూర్తిగా రద్దు చేశాడా అనేది క్లారిటీ లేదు.
శాంసంగ్ W-సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రతి సంవత్సరం చైనాలో విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో గొప్ప డిజైన్, ప్రత్యేక ఫీచర్లు, మెరుగైన ర్యామ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లు గ్లోబల్ Z-సిరీస్ మోడల్‌లపై ఆధారపడి ఉంటాయి. తాజాగా శాంసంగ్ (Samsung) చైనాలోని తన వెబ్‌సైట్‌లో W25 ఫ్లిప్ (Galaxy Z Flip 6 ఆధారంగా) W25 (Galaxy Z ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఆధారంగా)ని అధికారికంగా ప్రకటించింది.