మునిసిపల్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, వేస్ట్ మేనేజ్మెంట్, టౌన్ ప్లానింగ్, టిడ్కో ప్రాజెక్ట్ లపై చర్చించారు. రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి.. చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని.. దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పక్కాగా జరగాలని.. ఆ మార్పు రాష్ట్రంలో ప్రతి చోటా కనిపించాలని సీఎం అధికారులకు తెలిపారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మనేజ్మెంట్ గాడిలో పడాలని ఆదేశించారు.
Chandrababu: చనిపోతే ఒక్క క్షణం.. జైల్లో అనుమానాస్పద ఘటనలు.. చంద్రబాబు సంచలనం
రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు.. ఇతర కార్పొరేషన్‌లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలని ఆదేశించారు. అర్బన్ లోకల్ బాడీలలో మొత్తం 50 లక్షల గృహాలు ఉండగా.. ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని.. మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే అమృత్ పథకం ద్వారా మరో 7.5 లక్షల ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు.
Chennai: గ్యాస్ లీకేజ్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత..
తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు స్థితిగతులపైనా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేసేందుకు అవసరమై నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామని సీఎం అన్నారు. పట్టణ ప్రాంతంలో ఇంకా ఇళ్ల నిర్మాణం ఏ మేర చేపట్టాలి.. లబ్దిదారులు ఎందరు ఉంటారు అనే విషయంలో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ వంటి విభాగాల్లో డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. పీపీపీ పద్దతిలో పార్కులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు.