మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఆస్తులు కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని ఆరోపించారు.
షర్మిల వ్యాఖ్యలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. షర్మిల వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం తమకు గర్వకారణం.. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని పేర్కొన్నారు.
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫోటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ ఓకే చెప్పారని పేర్కొన్నారు.
ఈ నెల 31వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ముందు రోజైన 30వ తేదీన సిఫారసు లెటర్లు స్వీకరించబడవని వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదల చేసింది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 37-41 పాయింట్ల తేడాతో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మనకు ఆనందాన్ని, ఐక్యతా అనుభూతిని కలిగిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా బాణాసంచా కాల్చుతారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ‘ఫ్యూయల్ పంప్‌లో సమస్య’ కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.
పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. అందుకే రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగాలని ఆరోగ్య నిపుణలు సూచిస్తారు. పాలు తాగడం వల్ల బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. అంతే కాకుండా.. శరీరానికి కావాల్సిన అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు పాలలో నుంచి లభిస్తాయి.
పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్‌లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్‌ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.