IND vs NZ: రికార్డు సృష్టించిన న్యూజిలాండ్.. భారత గడ్డపై తొలిసారి
- చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టు
- న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం
- భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కైవసం
- 69 ఏళ్ల తర్వాత టీమిండియాపై కివీస్ టెస్టు సిరీస్ కైవసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టామ్ లాథమ్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పుణెలో శనివారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య 69 ఏళ్లుగా టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ న్యూజిలాండ్ పూణె టెస్టు మూడో రోజున న్యూజిలాండ్.. భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే..
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
స్వదేశంలో టీమిండియా ప్రతిష్ట దెబ్బతింది. 12 ఏళ్ల తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. 1955లో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగగా.. ఇరు దేశాల 69 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా ఓవరాల్ రికార్డు అద్భుతంగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు తమ మధ్య 64 టెస్టులు ఆడగా.. అందులో భారత్ 22 గెలిచింది. న్యూజిలాండ్ 15 టెస్టుల్లో విజయం సాధించింది. 28 డ్రాగా ముగిశాయి. అయితే ప్రస్తుత సిరీస్‌లో రోహిత్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ పాయే
శనివారం తొలి సెషన్‌లో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 198/5తో ఉదయం ప్రారంభించిన న్యూజిలాండ్.. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యశస్వి జైస్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంతేకాకుండా.. అర్ధ సెంచరీ కూడా చేశాడు. చివర్లో రవీంద్ర జడేజా (42) రాణించినప్పటికీ.. అప్పటికే భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. లంచ్ విరామం వరకు భారత్ ఒక వికెట్‌కు 81 పరుగులు చేసినప్పటికీ.. రెండవ సెషన్‌లో కివీస్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. న్యూజిలాండ్ బౌలర్లు ప్రమాదకరంగా బౌలింగ్ చేసి.. టీమిండియా బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. దీంతో.. టీమిండియా స్వదేశంలో సిరీస్‌ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!