తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన పలువురు ఐఏఎస్ (IAS)లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అందులో.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనరుగా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శి (GPM & PR)గా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది. అయితే.. తెలంగాణ నుంచి వచ్చిన మరో ఐఏఎస్ రోనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా.. అంతకుముందు ఐఏఎస్ ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. అటవీ, పర్యావరణశాఖ అదనపు కార్యదర్శిగా నియమించారు.
Read Also: Vijay: విజయ్ ఎవడికి భయపడడు.. తొలి బహిరంగ సభలోనే పవర్‌ఫుల్ స్పీచ్
కాగా ఏపీ, తెలంగాణలో పని చేస్తు్న్న ఐఏఎస్, ఐపీఎస్‌లను వారి వారి కేడర్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కేంద్రం ఆదేశాలతో వీరు ఏపీలో రిపోర్టు చేశారు. తాజాగా.. ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగులు ఇచ్చింది. అయితే.. తెలంగాణలో ఏపీ కేడర్ ఐఏఎస్‌లు అమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ప్రశాంతి, ఐపీఎస్‌లు అంజనీకుమార్, అభిలాష, అభిషేక్ మొహంతి పని చేశారు.
Read Also: Udhayanidhi: దళపతి విజయ్‌కి ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు..