కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ర్యాగింగ్ పై విచారణకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశించింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ చేత విచారణ జరిపించాలని ఎన్ ఎం సి ఆదేశించింది. మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు ఆదేశించింది ఎన్ఎంసి. ఇప్పటికే ప్రిన్సిపాల్ నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ విచారించి నివేదిక ఇచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు కమిటీ విచారణలో విద్యార్థులు వెల్లడించారు. ఎన్ఎంసి ఆదేశాలతో మరోసారి యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరుపనుంది. సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారించి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కాగా.. కాలేజీలో మెడికల్ ర్యాగింగ్ జరగలేదని మొదట కలరింగ్ ఇచ్చారు మెడికల్ కాలేజి అధికారులు.
Read Also: KA Movie: రాధా- సత్యభామలు చెప్పిన “క” కథా కమామిషు
కర్నూలు మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లజోడు కూడా తాము చెప్పిన వాటినే పెట్టుకోవాలని, అకాడమిక్ ఆన్ లైన్ యాప్ లు తాము చెప్పినవి తీసుకోవాలని సమాచారం. తరగతులు అయిన వెంటనే గుంపులు గుంపులుగా వెళ్లి క్యాంపస్ లోనే జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. కాలేజీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించగా ఎస్పీ కూడా హాజరయ్యారు. ర్యాగింగ్ నేరమని, ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
Read Also: Sonam Kapoor: వెరైటీ ఆభరణాన్ని ధరించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్..