హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల కేటాయింపులపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని కోరింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే.. ఈ సిరీస్‌ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. కాగా.. సిరీస్ స్కోర్‌లైన్ ఎలా ఉంటుందనేది సిరీస్ చివరి మ్యాచ్ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పిచ్ ఎలా ఉంటుందో మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్‌తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు.
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు.
సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 28-26 పాయింట్ల స్వల్ప తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది.
బిందు సేద్యం అమలులో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు.