వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ఎంత పెద్ద వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో కుల గణన ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. కాగా.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమర్థవంతంగా నిర్వహించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. 30 సర్కిళ్లకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ.. వారి కింద మూడు సర్కిళ్ల చొప్పున వీరికి బాధ్యతలను అప్పగించింది జీహెచ్ఎంసీ.
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత జిల్లాలు, మండలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని బండి సంజయ్ తెలిపారు.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ 'X'లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. నగరంలో కన్జ్యూమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు పెడ్లర్లను బాలాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రై గంజాతో పాటు మొదటిసారిగా ఓషియన్ గంజా పట్టుబడింది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.. జీవిత ఖైదు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పరిగి నియోజకవర్గంలోని తహసిల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన తెలుపుతూ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు.
కేసీఆర్, కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిత్తిలు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. రైతు కళ్లలో ఆనందం చూసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు గైర్హాజరు అయ్యారు. అనారోగ్య కారణంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట విచారణకు రాలేనని పోలీసులకు సమాచారం అందించారు మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 14న విచారణకు హాజరవుతానని చెప్పారు.