దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లిజెల్ లీ ఆదివారం మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2024లో అరంగేట్రం చేసింది. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌లో అజేయంగా 150 పరుగులు చేసి అద్భుత రికార్డు సృష్టించింది. హోబర్ట్ హరికేన్స్ తరుఫున ఆడుతున్న లీజెల్.. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో 75 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత చూపించింది. డబ్ల్యూబీబీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్.
శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి.
పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికి తెలిసిందే.. ఎందుకంటే పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక్కో పండులో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం యాపిల్, అరటి, మామిడి, జామ వంటి పండ్లను మాత్రమే ఎక్కువగా తింటుంటా. ఈ పండ్లతో పాటు మరో ప్రత్యేకమైన పండు కూడా ఉంది. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రెండో టీ20లో శాంసన్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.
కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు విదేశీగడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ గెలిచింది. ఆస్ట్రేలియన్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్ రెండో కెప్టెన్‌గా రిజ్వాన్ నిలిచాడు. సిరీస్ గెలిచిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. తాను టాస్, మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్ అని అన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)కి ముందు ఆస్ట్రేలియాకు గట్టిదెబ్బ తగిలింది. పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపై ఓడించింది. మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- పుణేరి పల్టాన్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34-33 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ.. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా..? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా..? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్‌లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు.