కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ అక్రమాలపై కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి.. స్వయంగా కేటీఆరే కార్ రేసింగ్‌కి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు.. తనను కాపాడుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని అన్నారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని మంత్రి ఆరోపించారు.
హైదరాబాద్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. బస్సుల స్క్రాప్ గోదాంలో మంటల చెలరేగాయి. మంటల దాటికి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు గ్రామాస్తులు చుక్కలు చూపించారు. ఫార్మా కంపెనీని గ్రామాస్తులు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయ సేకరణకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసినట్లు ఐసీసీకి తెలియజేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. ఐసీసీ ఈ-మెయిల్‌పై పీసీబీ స్పందించలేదు. ఐసీసీ నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా అందినప్పుడే పాకిస్తాన్ తన విధానాన్ని వెల్లడిస్తుందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం చెప్పారు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే అదిరిపోయే శుభవార్త ఉంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. సెడాన్ ఆరాపై ఈ (నవంబర్) నెలలో బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 2024లో హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
కంటిచూపు సమస్య రావడానికి కారణం.. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం. అంతే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో.. క్రమంగా చూడడంలో ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. గ్వెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గం.కు ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
వెస్టిండీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సాల్ట్ 54 బంతుల్లో 6 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీ తర్వాత.. ఫిల్ సాల్ట్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.