మహిళా సాధికారత కింద మోడీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. సీఐఎస్ఎఫ్ తొలి మహిళా బెటాలియన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళల సాధికారత, జాతీయ భద్రతలో వారి పాత్రను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను తనిఖీ చేయవచ్చు. 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు కొత్త ఫీచర్ నుండి ప్రయోజనం పొందనున్నారు. గాలి నాణ్యత పర్యవేక్షణను అందరికీ సులభతరం చేసే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్ లాంచ్ చేశారు. ఈ వారంలో 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి.
పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ కొన్ని పండ్లలో ఉండే విత్తనాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పండ్ల గింజల్లో సైనైడ్ అనే విష పదార్ధం తక్కువ మొత్తంలో ఉంటుంది. అది హానికరం కాకపోయినప్పటికీ, ఎక్కువ మొత్తంలో ఈ విత్తనాలను తీసుకోవద్దు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటాడనే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పటికీ మిగిలి ఉంది. అయితే.. ధోని ఈ సీజన్‌లో ఆడనున్నాడు. అందుకోసం.. అతనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్కే ఫ్రాంఛైజీ తీసుకుంది. కాగా.. ధోనీ ఈ ఐపీఎల్‌కు ఎప్పుడు గుడ్ బై చెబుతాడో అన్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బట్టబయలు చేశాడు.
బరువును కంట్రోల్ చేయాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడిని నియంత్రించాలి. బరువు తగ్గేందుకు జిమ్ లు, వ్యాయమం చేసేంత సమయం లేకపోతే.. కొన్ని కేలరీల బర్నింగ్ కార్యకలాపాలను అనుసరించవచ్చు. వీటి సహాయంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే మీ బరువును నియంత్రించే శరీర కార్యకలాపాలు ఏమిటో తెలుసుకుందాం..
పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ను ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీకి ఈ నెల (అక్టోబర్)లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు లభించింది. అలాగే.. మహిళల విభాగంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ అమేలియా కెర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది.
ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కొడంగల్లో భూసేకరణ పై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారని అన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి.. ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.