Bhatti Vikramarka: జార్ఖండ్ ఖనిజ సంపదపై బీజేపీ కన్నేసింది.. ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం
- జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలో తెలంగాణ డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రచారం
- జార్ఖండ్ ఖనిజ సంపదపై బీజేపీ కన్నేసింది-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఇండియా కూటమిని గెలిపించండి, జార్ఖండ్ భవిష్యత్‌ను కాపాడండి- డిప్యూటీ సీఎం
- అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం- భట్టి విక్రమార్క
- జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంచుతాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్‌లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలోని అపార ఖనిజ సంపదను అదానీ, అంబానీలకు అప్పగించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని అన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ సంపదను, వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని.. ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం.. జనాభా నిష్పత్తి ప్రకారం వనరులు, సంపద పంచేందుకు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించామని వివరించారు.
Pushpa 2 Trailer: ఏంటి భయ్యా ఆ మాస్ ఫాలోయింగ్.. జనసంద్రంగా మారిన పాట్నా
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
- Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
- YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
- 8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్లో తీర్మానం చేశామని.. ఆ తర్వాత అసెంబ్లీలో ఏకగ్రీవంగా కుల గణనకు బిల్లు పాస్ చేయించామని.. ప్రస్తుతం తెలంగాణలో శరవేగంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. ఇక్కడి సంపద ఈ ప్రాంత వాసులకే పంచుతామని.. అందుకు ఇక్కడ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేపడతామని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సంపద ఎవరి వద్ద ఉంది, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి వంటి అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేతగా.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నానని తెలిపారు. జార్ఖండ్ తరహాలోనే తెలంగాణ ప్రజలు మా నీళ్లు, నిధులు, నియామకాలు మాకు కావాలని సుదీర్ఘ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని వివరించారు.
Nandyal: కొత్త బురుజు ఆస్పత్రిలో వాచ్మెన్లే డాక్టర్లు
ప్రత్యేక రాష్ట్రాన్ని మొదట 10 సంవత్సరాల పాటు పాలించిన వారు రాష్ట్ర సంపద, వనరులను దోచుకున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు నాలుగు నెలలపాటు విరామం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా తాను మహా పాదయాత్ర నిర్వహించానని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర సంపదను సామాన్యులకు పొందుతామని తెలిపాం.. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను ఒకటి తరువాత ఒకటి అమలు చేస్తున్నామని అన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పథకాలు చేపట్టామని తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ మహాకూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో ఏడు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారులకు రావడం ఖాయం.. చివరి రెండు రోజులు మహాకూటమి, నాయకులు కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా సమిష్టిగా ప్రచారం చేసి ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!