తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు నిధులు విడుదల చేసింది. రూ. 205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది.
Read Also: IND vs AUS: పెర్త్ టెస్టుకు కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా.. రోహిత్ స్థానంలో ఎవరు ఆడనున్నారంటే..?
అంతేకాకుండా.. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ & బీ శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్ పోర్టు విస్తరణకు కావాల్సిన భూసేకరణ కోసం మంత్రుల బృందం అక్కడ పర్యటించింది. విమానశ్రయ విస్తరణకు మొత్తంగా 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనుంది. కాగా.. రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్‌ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామూనూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది.
Read Also: Pushpa 2 Trailer: పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసిందోచ్