అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా.. గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కేరాఫ్ రవీంద్రభారతి”. జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు, మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి డైరెక్టర్‌కి కథని అందించి.. ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. గట్టు నవీన్ తనకు చాలా కాలంగా తెలుసని.. చాలా కష్టపడే వ్యక్తి అని అన్నారు. తన మొదటి సినిమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ తనకు తెలుసని చెప్పారు. ఎందరో కళాకారుల కళ ఈ రవీంద్రభారతి.. 60 ఏళ్ల రవీంద్రభారతికి ఒక కళాకారుడు ఇచ్చే కళా నీరాజనం ఈ సినిమా అని తెలిపారు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు మామిడి హరికృష్ణ చెప్పారు.
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లు భారత్‌లోనే..
డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ.. ఒక్కసారి రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని చాలా మంది కళాకారులకు ఉంటుందన్నారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది.. హీరో అవ్వాలి అనే తన కళ మొదటి సినిమాతో జరిగిందని తెలిపారు. ఇప్పుడు తన ప్రెండ్స్‌ని హీరోలుగా చేస్తున్నాను.. అవకాశం ఇచ్చిన తమ నిర్మాతకి ధన్యవాదాలు చెప్పారు. జబర్దస్త్ జీవన్ మాట్లాడుతూ.. మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం సినిమా గురించి విజయోత్సవ వేడుకలో మాట్లాడుతాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ MVK మల్లిక్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంటుంది.. పాటలు కూడా చక్కగా కుదురుతున్నాయి. లిరిసిస్ట్ మౌనశ్రీ మల్లిక్, అధ్వైత్ రాజ్ చక్కటి సాహిత్యం అందించారని అన్నారు. అలాగే తమ సినిమాటోగ్రాఫర్ మస్తాన్ సిరిపాటి సైతం మంచి టెక్నీషియన్ అని అన్నారు. హీరోయిన్ నవీన మాట్లాడుతూ.. మంచి కథలో తాను భాగం అయ్యానని.. తనను ఈ పాత్రలో ఎంచుకున్న డైరెక్టర్ నవీన్‌కి, ప్రొడ్యూసర్‌కి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ.. మంచి కoటెంట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: మస్తాన్ సిరిపాటి, సంగీతం: MVK మల్లిక్, ఎడిటింగ్- యూనిక్ బొజ్జపల్లి.