BCCI: హెడ్ కోచ్‌పై ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ దాడి, నుదిటిపై 20 కుట్లు.. చర్యలకు సిద్దమైన బీసీసీఐ!
- హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్‌పై దాడి
- కోచ్‌పై ముగ్గురు స్థానిక క్రికెటర్లు దాడి
- ఆటగాళ్లపై చర్యలకు సిద్దమైన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (సీఏపీ) అండర్-19 హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్‌పై దాడి జరిగింది. సోమవారం ముగ్గురు స్థానిక క్రికెటర్లు కోచ్‌పై దాడి చేశారు. దాడిలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజేష్ ధ్రువీకరించారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నుంచి ఆటగాళ్లను తొలగించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పుదుచ్చేరి స్థానిక క్రికెటర్లకు దేశీయ మ్యాచ్‌లలో సీఏపీ అధికారులు తగిన అవకాశాలను ఇవ్వడం లేదు. నకిలీ జనన, విద్య ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ చిరునామాలతో బయటి క్రికెటర్లను స్థానికులుగా ఆడిస్తున్నారు. 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు స్థానిక ప్లేయర్స్ మాత్రమే పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో అవకాశం ఇవ్వకపోవడంతో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు వెంకటరామన్‌పై బ్యాట్‌తో దాడి చేశారు. ఈ దాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ.. ‘పాండిచ్చేరి కోచ్‌పై దాడి జరిగినట్లు తెలిసింది. బీసీసీఐ త్వరలో దర్యాప్తు చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
- Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
తనపై జరిగిన దాడిపై కోచ్ వెంకటరామన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘డిసెంబర్ 8న, ఉదయం 11 గంటలకు నేను సీఏపీ క్యాంపస్‌లో ఇండోర్ నెట్స్‌లో ఉన్నాను. పాండిచ్చేరి సీనియర్ క్రికెటర్లు కార్తికేయన్ జయసుందరం, ఎ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమరన్ వచ్చి నాతో దుర్భాషలాడడం ప్రారంభించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదని వాగ్వాదం పెట్టుకున్నారు. అరవిందరాజ్ నన్ను పట్టుకున్నాడు. కార్తికేయన్, సంతోష్ బ్యాట్‌తో నాపై దాడి చేశారు. జట్టులో అవకాశం రావాలంటే తనను కొట్టమని భారతీదాసన్ పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జి. చంద్రన్ చెప్పాడని వారు నాతో చెప్పారు’ అని ఫిర్యాదులో కోచ్ వెంకటరామన్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్పందించడానికి సీఏపీ నిరాకరించింది.
తాజావార్తలు
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!