ఎదిగే కొద్దీ మొక్క ఒదిగి ఉంటుంది. ఇది పదవుల్లో ఉన్న నేతలకు… వారి బంధువులకు వర్తిస్తుంది. వారే ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే మాట.. చేసే చేతలు పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ.. తమంతటి వారు లేరని విర్రవిగితే చిక్కుల్లో చిక్కుకోక తప్పదు. అంతేకాదు.. సొంత పార్టీని ఇబ్బందుల్లో పెడతారు. అలాంటి ముగ్గురు నాయకుల చుట్టూనే ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో చర్చ జరుగుతోంది. వారే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి […]
AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని […]
పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్ కేబినెట్ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. […]
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనగానే రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు. వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన వారంతా.. తిరిగి వెళ్తూనే బోల్డన్ని కలలు కంటున్నారు. అందులో ప్రధానమైన స్వప్నం అసెంబ్లీలో అడుగుపెట్టడం. ఈ విషయంలో ఎవరికివారు ఊహాలోకంలో విహరించేస్తున్నారు. మీటింగ్స్‌లో పార్టీ పెద్దలు ఏం చెప్పారో.. వారి మాటలకు అర్థాలేంటో లోతైన అధ్యయనం చేయకుండానే కొత్త లెక్కలతో కుస్తీ పడుతున్నారట బీజేపీ కార్పొరేటర్లు. ప్రస్తుతం […]
శంకర్ నారాయణ. సీఎం జగన్ కేబినెట్ వన్‌లో అనుకోకుండా చోటు సంపాదించిన మంత్రుల్లో ఒకరు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కురుబ సామాజికవర్గం కావడంతో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 2019లో మినిస్టర్ అయ్యారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు బాగానే నడిచింది. పెనుకొండ నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు.. శంకరనారాయణ మంత్రి పదవి పోయాక కానీ బయట పడలేదు. ఎవరైతే ఆయన గెలుపునకు బ్యాక్ బోన్‌గా ఉన్నరో వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారట. శంకరనారాయణ మంత్రిగా […]
మసిఉల్లా.. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మసిఉల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక కేసులో ఆయన పేరును ముడిపెడుతూ విపక్షాలు అంతెత్తున లేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారంలో అధికారపార్టీ ఏం చేస్తుందనే చర్చ మొదలైంది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు మసిఉల్లా. ఇటీవలే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. అయితే మసిఉల్లా […]
చాలాకాలం తర్వాత ఏపీపై బీజేపీ హైకమాండ్‌కు ఫోకస్ పెట్టింది. ఈ రాష్ట్రాన్ని కూడా ముఖ్యమైన రాష్ట్రాల జాబితాలో చేర్చిందా..? అనే స్థాయిలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రెండు రోజులు ఏపీలో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు కూడా. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ నినాదాన్ని కూడా తెలుగులో వినిపించారు నడ్డా. వైసీపీ పోవాలి.. బీజేపీ […]
మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి. ఇద్దరూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. వేర్వేరు వర్గాలు. తూర్పు.. పడమర ప్రాంతాలకు చెందిన నాయకులు. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇన్నాళ్లూ అంతర్గత కలహాలతో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇద్దరూ.. ప్రస్తుతం యుగళగీతం ఆలపించడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అధిష్ఠానం ఒత్తిడో ఏమో ఇద్దరూ ఒకే లైన్లోకి వచ్చారు. ఇలాంటి సమయంలో ప్రేమ్ సాగర్‌రావు చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. […]
మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ గడువు ఈ నెల 6తో ముగిసింది. అయితే రిమాండ్ ముగియక ముందే ఆన్లైన్లో విచారణకి హాజరవుతానని మెజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు ఎమ్మెల్సీ. ప్రజాప్రతినిధి కావడంతో భద్రతను కారణంగా చూపారు. కేసు తీవ్రత దృష్ట్యా మెజిస్ట్రేట్ ఎమ్మెల్సీ అభ్యర్థనను తిరస్కరించారు. ఇంకేముందీ అనంతబాబు కోర్టుకి హాజరవడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎస్సీ […]