Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈవీ) సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత సంఖ్య: ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 810 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఇందులో జంట నగరాల పరిధిలో 300కు పైగా బస్సులు తిరుగుతున్నాయి.
జనవరి చివరి నాటికి మరో 175 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అత్యాధునిక ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకం కింద అతి త్వరలో ఏకంగా 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ దశలవారీగా ఒకటి లేదా రెండు సంవత్సరాలలో పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
ఆర్టీసీ రవాణా వ్యవస్థను ఈవీ బస్సుల ద్వారా ముందుకు తీసుకువెళ్లి, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను విస్తరించడంలో భాగంగా త్వరలో 373 కొత్త ప్రాంతాలకు బస్ కనెక్టివిటీని అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటర్ సిటీ ట్రాన్స్‌పోర్టేషన్ కింద వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి చుట్టుపక్కల జిల్లాల నుండి హైదరాబాద్‌కు ఈవీ బస్సులను స్టార్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బస్సుల విస్తరణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మహాలక్ష్మి పథకం అమలు ద్వారా ఆర్టీసీ వ్యవస్థ లాభాల బాట పట్టిందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇస్తూ, వారి సమస్యలన్నీ అతి త్వరలో పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.
Baz Drone: ప్రపంచంలోనే మొదటి ‘Sky Hunter’ డ్రోన్ – భారీ ప్రొడక్షన్‌కు సిద్ధమైన భారత్!