హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ .గోపాల్ రెడ్డి కలసి ‘మువ్వగోపాలుడు’తో హ్యాట్రిక్ సాధించారు. అంతకు ముందు ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘మంగమ్మగారి మనవడు’ 560 రోజులు, ‘ముద్దుల క్రిష్ణయ్య’ 365 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించాయి. వీరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వగోపాలుడు’ సైతం 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ముగ్గురు కలసి మూడు త్రిశతదినోత్సవాలు చూసిన ఘనత అప్పటి దాకా ఎవరికీ లేదు. […]
అగ్నిపథ్ ఎందుకు మంటలు రేపుతోంది?కేంద్రం ఏమంటోంది? అభ్యర్థుల సమస్యేంటి?అగ్నిపథ్ పథకంతో ఆర్మీకి ప్రయోజనం ఎంత?జీతాలు, పెన్షన్ల భారాన్ని తగ్గించటానికే ఈ స్కీమ్ తెచ్చారా? కేంద్ర ప్రభుత్వం మంగళవారం త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమకు అన్యాయం చేస్తోందంటూ సైనిక నియామక రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకులు దేశంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆందోళనలు […]
కెసీఆర్ జాతీయ పార్టీ ..ఇప్పుడిదే సంచలనం..రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ…ఈ పార్టీ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఒకటైతే.. అసలు ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది జాతీయ పార్టీ నిలబడుతుందా అనేది మరో చర్చ..గులాబీ పార్టీ పునాదులపై నిలిచే బీఆర్ఎస్ కున్న సాధ్యాసాధ్యాలేంటి?ఇదే ఈ రోజు స్టోరీ బోర్డ్. చాలా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైతే చాలా వరకు ఊహాగానాలే.కానీ, కెసీఆర్ వ్యూహాలు సామాన్యంగా ఉండవనేది అందరూ ఒప్పుకునే విషయమే. అందుకే బీఆరెస్ విషయంలో క్లారిటీ వచ్చే వరకు ఈ ఉత్కంఠ […]
విజయనగరం జిల్లాలో రాజకీయంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతోపాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలు ఉన్నాయి. విశాఖ-విజయనగరం జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్. విశాఖకు దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇవన్నీ చూసిన టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగిపోయారు. మూడేళ్లుగా చడీచప్పుడు లేకుండా ఉన్నా.. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు. […]
పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల బెడద కిందిస్థాయి కార్యకర్తలకు ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఓదెలు జడ్పీటీసీ గంటా రాములు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీ వేరు కుంపటి పెట్టేశారు. దీంతో ఎవరి వైపు వెళ్లాలో కాంగ్రెస్ శ్రేణులకు అర్థం కావడం లేదట. రాజకీయంగా విజయ రమణారావు, రాములు ఇద్దరు గురు శిష్యులు. గతంలో టీడీపీ ఉన్నవాళ్లే. […]
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్. […]
ఏపీలో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉండటమే దానికి కారణం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉన్నా.. ఇప్పటి నుంచి పావులు కదుపుతున్న నేతలు ఎక్కువే. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమె దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో రాజమండ్రి అర్బన్, రూరల్ ఓటర్లు టీడీపీకే […]