కొత్తపల్లి సుబ్బారాయుడు. రాజకీయంగా దిట్ట అనేది ఒకప్పటి మాట. కొత్త పార్టీల ఎంట్రీతో మారిన రాజకీయాలను అంచనా వేయలేక ఇప్పుడు సాధారణ నాయకుడిగా మిగిలిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వరసగా గెలుస్తూ అదే స్పీడ్‌లో ఉన్నత పదవులు అందుకున్నారు. అప్పటి వరకు జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించేవారు. అలాంటిది 2009 నుంచి ఆయన అంచనాలు సరిగ్గా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అప్పుడు మొదలైన రాజకీయ పతనం.. కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి.. ఉనికి కాపాడుకోవడానికి […]
అగ్నిపథ్ సమస్యగా ఎందుకు మారింది?సైన్యంకంటే ఆయుధాలే కీలకమని ప్రభుత్వం భావిస్తోందా?జీతాలు, పెన్షన్లు భారమనుకుంటోందా? సైన్యం కేవలం యుద్ధాల కోసమేనా?అగ్నిపథ్ అగ్గిరాజేసింది..ప్రభుత్వం యువతను సైన్యంలో భాగస్వాములను చేయటానికి అని చెప్తోంది.యువత మా ఉద్యోగాలను మాకివ్వాలని నినదిస్తోంది..ఇరుపక్షాల వాదనలు బలంగానే కనిపించినా, కనిపించే అంశాల వెనుక అసలు సంగతేమిటనేది కీలకంగా మారుతోంది. ఏ ఉద్యోగికైనా కొంత పని, దానికి ఆదాయం ఉంటుంది…ఆ పనికి ఉండే డిమాండ్‌ని బట్టి జీతం ఉంటుంది..ఇదే లెక్కలో చూస్తే సైన్యాన్ని కూడా ప్రభుత్వం చూస్తోందా?జనం ప్రాధాన్యత […]
విజయారెడ్డి. కాంగ్రెస్ దివంగత నేత PJR కుమార్తె. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్. రాజకీయ ప్రయాణాన్ని వైసీపీ నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2014లో ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారామె. ఖైరతాబాద్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో మరోసారి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని విజయారెడ్డి ఆశించినా.. టీఆర్ఎస్ మాత్రం దానం నాగేందర్‌కు ఛాన్స్ ఇచ్చింది. తనకు రావాల్సిన సీటును దానం తన్నుకుపోయారని […]
స్వేచ్చగా ఉన్నప్పుడు భూతుపురాణం. పోలీసులు గాలిస్తుంటే అజ్ఞాతవాసం. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్టైల్. పర్యాటకశాఖ మంత్రి ఆర్కేరోజాను కించపరిచేలా అయ్యన్న కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతోంది. చోడవరం మినీ మహానాడు వేదిక నుంచి ఆయన చేసిన వ్యాఖ్యాలపై అధికారపార్టీ భగ్గుమంది. వ్యక్తిగతంగా అయ్యన్నను టార్గెట్ చేసిన అధికారపార్టీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మహిళా మంత్రినే కాదు పోలీసు అధికారులను అయ్యన్నపాత్రుడు తరచూ ఆక్షేపించడం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి విశాఖజిల్లా […]
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండలో ఓడినా.. ఇక్కడి వైసీపీలో వర్గపోరు మాత్రం పీక్స్‌లో ఉంది. ఆ పోరు కూడా ఒకే కుటుంబంలోని వైసీపీ నేతల మధ్య కావడంతో ఘర్షణలు.. కేసులు.. వార్నింగ్స్ పరిస్థితిని వేడెక్కిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఫ్యామిలీ సభ్యులే రోడ్డెక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. విశ్వేశ్వర్రెడ్డే ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్. ఇక్కడ ఆధిపత్యం కోసం ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ప్రయత్నించేవారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివరామిరెడ్డికి మరోసారి ఛాన్స్ ఇవ్వడంతో ఆయన కామైపోయారు. కానీ.. విశ్వేశ్వర్‌రెడ్డికి […]
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ […]
గత నెల 24న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టవద్దని చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఆ అల్లర్లలో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంటెలిజెన్స్ విఫలమైందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులను.. వారు చేసే విధ్వంసాన్ని పోలీసులు అంచనా వేయలేకపోయారు. ఈ సందర్భంగా కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి తీరు చర్చకు వచ్చింది. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 72 రోజుల తర్వాత ఆయన్ని […]
వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్‌లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు. 3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, […]
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు ఎత్తులు.. జిత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఆ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు… జనసేనకు వన్‌సైడ్ లవ్ అని కన్నుగీటారు. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మాటలు.. ప్రకటనలతో రెండు పార్టీలు దగ్గరవుతున్నట్టు భావించారు. కానీ.. ఇటీవల నిర్వహించిన మహానాడు తర్వాత టీడీపీ […]