ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సముతిరకని. తమిళనాట నటదర్శకునిగా సాగుతున్న సముతిరకని అనేక తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. దర్శకునిగానూ తెలుగులో కొన్నిచిత్రాలు తెరకెక్కించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’, ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలతో సముతిరకని నటునిగానూ తెలుగువారికి దగ్గరయ్యారు . సముతిరకని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదయ సిథమ్’ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. సముతిరకని 1973 ఏప్రిల్ […]
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆయన అభిమానులను సైతం నిరాశపరిచిన ఈ సినిమా ‘కెజిఎఫ్2’ దెబ్బకి అడ్రెస్ లేకుండా పోయింది. ‘కొలమావు కోకిల’, ‘డాక్టర్’ సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు పాటలు హిట్ కావటంతో పుల్ హైప్ క్రియేట్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత తుస్సుమనిపించింది. రిలీజ్ తర్వాత సినిమా ప్లాఫ్ […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు. గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా.. ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ. అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకొన్నవాళ్లూ GHMC ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు. దీంతో హైదరాబాద్‌లో బీజేపీ బలపడటానికి అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు. వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే […]
నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు గుంటూరు టీడీపీ నేతలు. పైగా ప్రచార యావ పెరిగిపోవడంతో.. వ్యక్తిగతంగా హైలైట్ కావడానికే చూస్తున్నారట. ఏ కార్యక్రమం చేసినా ఫొటోలు దిగడం.. గ్రూపులు కట్టుకోవడమే సరిపోతున్నట్టు తమ్ముళ్ల వాదన. ఈ పోకడలు కార్యకర్తల్లో కనిపిస్తే పెద్దగా పట్టించుకోరు కానీ.. నియోజకవర్గంలో పార్టీని నడిపించాల్సిన నాయకులే ఈ తరహాలో వింత పోకడలకు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందట. గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు..గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. గుంటూరు నగర టీడీపీ […]
చెప్పకుండా రేవంత్ రావడంపై నల్లగొండ జిల్లా నేతల అభ్యంతరం?కాంగ్రెస్ అంటేనే నేతల మధ్య కయ్యలా మారి పార్టీగా మారిపోయింది. అది జిల్లాస్థాయి సమావేశమైనా.. తాజాగా రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశమైనా పంచాయితీ కామన్. మీడియా ముందే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్సే అందుకు అద్దం పడుతున్నాయి. సీఎల్పీలో మీడియా సమావేశం కంటే ముందే.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ ఇంట్లో భేటీలు జరిగాయి. కొందరు ముఖ్య […]
బాలినేని గౌరవానికి తగ్గట్టు ప్రకటన లేదని అనుచరులు నిరాశ బాలినేని శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆదిమూలపు సురేష్‌ను ఉంచి.. బాలినేనికి గుడ్‌బై చెప్పారు. దాంతో ఆయన అభిమానులు ఎలాంటి హంగామా చేశారో రాష్ట్రమంతా చూసింది. రెండురోజుల హైడ్రామా తర్వాత సీఎం జగన్‌తో భేటీ అయ్యాక అలకవీడారు బాలినేని. వైసీపీలో సముచిత స్థానం ఇవ్వడంతోపాటు త్వరలో జిల్లా పర్యటనకు వస్తానని ఆ సమయంలో బాలినేనికి మాట ఇచ్చారట సీఎం జగన్. ఆ క్రమంలోనే ప్రకాశం, […]
సీఎం కేసీఆర్‌కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందా? కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సర్వేపై చర్చ జరుగుతోంది. పీకే ఎంట్రీతో పార్టీలో ఏం జరగబోతుంది? టీఆర్ఎస్లో మార్పులు చేర్పులపై నేతల మధ్య గుసగుసలు ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐ ప్యాక్… టిఆర్ఎస్ మధ్య ఒప్పందం ఖరారైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీతో కలిసి పనిచేయనుంది ఆ సంస్థ. ఇప్పటికే పని మొదలుపెట్టిన సర్వే బృందాలు.. తెలంగాణలో రాజకీయ […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్-2’ సక్సెస్ రూటులో సాగిపోతోంది. ఈ సినిమా హిందీ వర్షన్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’, ‘ట్రిపుల్ ఆర్’ హిందీ సినిమాల కన్నా మిన్నగా వసూళ్ళు చూసిందని బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘కేజీఎఫ్-2’ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల వారాంతం చూసింది. అందువల్ల మొదటి రోజునే భారీ వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం హిందీ వెర్షన్ తొలి రోజున రూ.53.95 కోట్లు పోగేసింది. కానీ, 2017 ఏప్రిల్ 28న విడుదలైన […]
నెల్లూరు జిల్లా ఉదయగిరి. ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ మధ్య తరచూ వార్తల్లో.. ప్రచారంలో ఉంటున్న శాసనసభ్యుడు. వివాదాలు కోరుకుంటున్నారో ఏమో.. అవి లేకుండా చంద్రశేఖర్‌రెడ్డి పేరు ఉదయగిరిలో వినిపించదు. ఈ కోవలోనే చర్చల్లోకి వస్తోంది ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి యవ్వారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత చెబితే అంత కాదు.. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. దాంతో ఆయనకు ఎమ్మెల్యే షాడో అనే గుర్తింపు వచ్చేసిందిట. ఏ పని కావాలన్నా మొదటిగా […]
వరంగల్ నగరంలో వివిధ పార్టీలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో రచ్చ రచ్చ అవుతోంది. వీటి విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే నామ మాత్రంగా ఫైన్స్ వేస్తున్నారట. అదే ప్రతిపక్షపార్టీలకు చెందిన ఫ్లెక్సీలు పెడితే.. కేసుల కొరడా లేకపోతే వేలు, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారట. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు కూడా అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఆ మధ్య వరంగల్ […]