నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన జీవితంలో ఓ సంఘటనను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఆ విషయం వింటే వింతగా అనిపిస్తుంది. ‘అపురూపం’ అనే తెలుగు సినిమాతో వెలుగు చూడవలసిన ప్రియాంక చోప్రా అది విడుదల కాకపోవడంతో వేరే చిత్రంతో తొలిసారి జనం ముందు నిలిచారు. అప్పటి నుంచీ కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగిన ప్రియాంక అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. నేడు హాలీవుడ్ లోనూ పేరు సంపాదించారామె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి […]
హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని లేకుండా ఎందరో నటీనటులు తమకు తెలిసిన అంశాలపైనో, లేక ట్రావెలింగ్ తోనో, కాకపోతే తమ ఆత్మకథలనో పుస్తకరూపంలో జనం ముందుంచారు. ఇవన్నీ నాన్ ఫిక్షన్ గానే పరిగణించారు. కానీ, ఓ నటుడు అందునా రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను అందుకున్న టామ్ హ్యాంక్స్ లాంటివారు ‘ఫిక్షన్’తో ఓ నవలను రాయడం నిజంగా విశేషమే!పైగా తాను చుట్టూ చూసిన ‘రంగుల ప్రపంచం’ ఆధారంగానే ఈ నవలను రచించడం […]
ఆస్కార్ సందడి మళ్ళీ మొదలైంది. వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే 95వ ఆస్కార్ ఉత్సవం ఈ యేడాది మార్చి 12 ఆదివారం సాగింది. అందులోనే మన తెలుగు సినిమా ‘ట్రిపుల్ ఆర్’ బెస్ట్ సాంగ్ కు గాను, మరో ఇండియన్ మూవీ ‘ఎలిఫెంట్ విష్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో ఆస్కార్ అందుకొని మురిపించాయి. దాంతో ఇప్పటికీ ఇండియన్స్ లో ఆస్కార్ పేరు వినగానే ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం […]
Shamili: బాలనటిగానే భళా అనిపించిన షామిలి నాయికగా మాత్రం సక్సెస్ చూడలేక పోయింది. రెండేళ్ళ ప్రాయంలోనే మణిరత్నం 'అంజలి'లో అద్భుతంగా నటించేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు సంపాదించింది. ఆ తరువాత అనేక తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ రూటులో సాగింది.
Shahrukh Khan:సినిమా రంగంలో ప్రముఖులైన స్టార్స్ తమ వారసులను డైరెక్ట్ చేసిన సందర్భాలు బోలెడు కనిపిస్తాయి. కానీ, స్టార్స్ అయిన తమ తండ్రులకు దర్శకత్వం వహించిన కుమారులు కొందరే తారసపడతారు. ఈ కోవలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రాజ్ కపూర్ అనే చెప్పాలి.
Boyapati Srinu: పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే స్టార్ డైరెక్టర్ అయిపోయారు బోయపాటి శ్రీను. నవతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో చోటు దక్కించుకున్న బోయపాటి శ్రీను ఇప్పటి దాకా తొమ్మిది చిత్రాలు రూపొందించగా, అందులో మూడు సినిమాలు ఆట్టే ఆకట్టుకోలేక పోయాయి. దాంతో బోయపాటి సక్సెస్ రేటు 66.6 శాతం నమోదయింది.
చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో తనదైన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చలేదు. పాతికేళ్ళకు పైబడి కెరీర్ సాగిస్తున్న పవన్ సైతం కీరవాణి బాణీలతో సాగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే! ఎందుకంటే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినదే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో. ఆ తరువాత స్టార్ హీరోస్ అందరి చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చారు. వాటిలో […]
మణిరత్నం మేగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం తెలుగునాట అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏప్రిల్ 28న ‘పొన్నియిన్ సెల్వన్’ రెండవ భాగం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో “ఫస్ట్ పార్ట్ లో కేవలం పాత్రల పరిచయం జరిగింది. అసలు కథ రెండో భాగంలోనే ఉంది” అంటూ మణిరత్నం సెలవిచ్చారు. దాంతో ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2 ప్రదర్శన సమయం మూడు గంటలకు పైగా ఉందనే పుకారు షికారు చేస్తోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ 167 […]