ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విలక్షణ నటుడు రాబర్ట్ డి నీరో ఏదో విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ‘గాడ్ ఫాదర్-2’తో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గానూ, ‘రేజింగ్ బుల్’తో బెస్ట్ యాక్టర్ గానూ ఆస్కార్ అవార్డులు అందుకున్న రాబర్ట్ డి నీరో ఆ పై కూడా విలక్షణమైన పాత్రల్లో అలరించారు. ప్రస్తుతం డి నీరో వయసు 79 ఏళ్ళు. ఈ వయసులోనూ రాబర్ట్ డి నీరో ఓ బిడ్డకు తండ్రి కావడం ఇప్పుడు హాలీవుడ్ లో ఓ చర్చగా […]
Chandra Bose: "మంచు కొండల్లోన చంద్రమా... చందనాలు చల్లిపో..." అంటూ వచ్చిన చంద్రబోస్ తెలుగువారిపై తన కవితాచందనాలు చల్లుతూనే పున్నమినాటి వెన్నెల విహారాల ఆనందాన్ని అందిస్తున్నారు. తన దరికి చేరిన ఏ అవకాశాన్నైనా ఇట్టే వినియోగించుకోగల చంద్రబోస్ వద్ద ఉన్న పదసంపద అగణితం! "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..." అంటూ సృష్టిధర్మం చెబుతారు.
M.S Raju: ఇప్పుడైతే యమ్.యస్.రాజు అంటే ఓ నాటి నిర్మాత అని కొందరు భావించవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం యమ్మెస్ రాజు సినిమా వస్తోందంటే, అగ్ర కథానాయకులు సైతం తమ చిత్రాన్ని విడుదల చేయాలా వద్దా అని ఆలోచించేవారు.
Sai Pallavi: "అరె... మన సాయిపల్లవికి ఏమైంది?... ఈ మధ్య ఆమె సినిమాలేవీ కనిపించడం లేదు..." అంటూ నటి, నర్తకి సాయిపల్లవి అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే, తెలుగులో 'విరాటపర్వం' తరువాత సాయిపల్లవి కనిపించలేదు. తమిళ చిత్రం 'గార్గి' సాయి పల్లవి తెరపై కనిపించిన చివరి చిత్రం.
Chalapathi Rao: ప్రముఖ నటుడు చలపతిరావు 'గులాబి' సినిమా తరువాత వరుసగా హీరోహీరోయిన్లకు తండ్రి పాత్రల్లో కనిపిస్తూ సాగారు. అంతకు ముందు అనేక చిత్రాలలో అమ్మాయిలను బలాత్కారం చేసే విలన్ గానూ కనిపించారు.
మెగాస్టార్ చిరంజీవి, వైవిధ్య చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మధ్య అనుబంధం విశేషమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తొలిచిత్రం 'ఇంట్లోరామయ్య-వీధిలో క్రిష్ణయ్య' హీరో చిరంజీవి
చిత్రసీమను నమ్ముకుంటే, ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి, ఇప్పటికి దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించేశారు సందీప్ కిషన్.