Boyapati Srinu: పట్టుమని పది సినిమాలు కూడా తీయకుండానే స్టార్ డైరెక్టర్ అయిపోయారు బోయపాటి శ్రీను. నవతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో చోటు దక్కించుకున్న బోయపాటి శ్రీను ఇప్పటి దాకా తొమ్మిది చిత్రాలు రూపొందించగా, అందులో మూడు సినిమాలు ఆట్టే ఆకట్టుకోలేక పోయాయి. దాంతో బోయపాటి సక్సెస్ రేటు 66.6 శాతం నమోదయింది. బోయపాటి శ్రీను పదవ చిత్రం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొంది అంతగా ఆకట్టుకోని చిత్రాలలో “దమ్ము, వినయ విధేయ రామ, జయజానకీ నాయక” ఉన్నాయి. ఈ మూడు సినిమాల్లోనూ యంగ్ స్టార్ హీరోస్ నటించడం గమనార్హం! ఇక బోయపాటి సీనియర్ స్టార్స్ తో రూపొందించిన “భద్ర, తులసి, సింహా, లెజెండ్, అఖండ” చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ ఐదు చిత్రాలలో మూడు సినిమాల్లో బాలకృష్ణనే కథానాయకుడు కావడం విశేషం! బాలయ్యతోనే వరుసగా మూడు సిల్వర్ జూబ్లీస్ చూసి ఓ కొత్త రికార్డ్ సృష్టించారు బోయపాటి. యంగ్ హీరోస్ లో అల్లు అర్జున్ తో బోయపాటి తెరకెక్కించిన ‘సరైనోడు’ టైటిల్ కు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కూడా రాణించింది.
Shanvi Srivastava: పిల్ల భలే.. దీని ఫిగర్ భలే..
ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను టాప్ స్టార్స్ కే బాగా కలసి వస్తారని, యంగ్ హీరోస్ ను అంతగా హాండిల్ చేయలేక పోతున్నారని వినిపిస్తోంది. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కాబట్టి రామ్ పోతినేనితో ఆయన తీసే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమా బోయపాటికి ఓ సవాల్ అనే చెప్పాలి. యంగ్ హీరోస్ కు బోయపాటి డైరెక్షన్ ఆట్టే అచ్చిరాదనేవారికి ఈ సినిమాతో శ్రీను సమాధానం చెప్పి తీరాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే రామ్ పోతినేని సినిమాను బోయపాటి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రామ్ తో బోయపాటి ఓ బంపర్ హిట్ కొట్టారంటే ఆయనపై ఉన్న ముద్ర చెరిగిపోవడమే కాదు, మరెందరో యంగ్ హీరోస్ బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి క్యూ కడతారు. సో… రాబోయే బోయపాటి శ్రీను సినిమా ఓ లిట్మస్ టెస్ట్ అనే చెప్పాలి.