ఓ వైపు మాస్ పల్స్ పట్టేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా, మరోవైపు గాడ్ ఆఫ్ మాసెస్ గా జేజేలు అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ చిత్రం... ఇక సంక్రాంతి బరిలో సందడికి కొదువే లేదు అని సినీజనం భావిస్తున్నారు. అయినాసరే, వారి చిత్రాలు రంగంలో ఉన్నా, తాను నిర్మించిన తమిళ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగువారి ముందు ఉంచుతున్నారు దిల్ రాజు.
నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న 'ఆహా'లోని 'అన్ స్టాపబుల్' రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు 'గ్లింప్స్' వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి.
తెలుగునేలపై 'బాలనాగమ్మ కథ' తెలియనివారు అరుదనే చెప్పాలి. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాయలపకీరు వచ్చి బాలనాగమ్మను కుక్కగా మార్చి తీసుకువెళ్ళాడనే కథను చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరైనా మాయ చేసే మాటలు పలికితే, "మాయలపకీరులా ఏం మాటలు నేర్చావురా?" అంటూ ఉంటారు.
Krishna's movie 'Eenadu' completes 40 years: 'నటశేఖర'గా, 'సూపర్ స్టార్'గా అభిమానుల మదిలో చోటు సంపాదించిన కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు'. మాస్ హీరోగా సాగుతున్న కృష్ణ ఇందులో నాయిక లేకుండా నటించడం అప్పట్లో ఓ సాహసంగా చెప్పుకున్నారు. అదీగాక ఈ చిత్రాన్ని కృష్ణ తమ సొంత 'పద్మాలయా పిక్చర్స్' పతాకంపై నిర్మించి, నటించారు. అందువల్ల తొలి నుంచీ 'ఈనాడు' పై సినీఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. 1982 డిసెంబర్ 17న విడుదలైన 'ఈనాడు' చిత్రం ఘనవిజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వీరిద్దరి మధ్య పోటీ అంటే దక్షిణాది సినిమా అభిమానులందరికీ ఓ ప్రత్యేకమైన ఆసక్తి ! అందులోనూ ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీ పడడమంటే మరింత ఆసక్తి పెరుగుతుంది.