Unstoppable 2: ‘బాహుబలి’ని ఉక్కిరిబిక్కిరి చేసిన బాలయ్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘ఆహా’లోని ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు ‘గ్లింప్స్’ వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రోమో కూడా అలా వచ్చిందో లేదో ఇలా అభిమానులను అలరించేస్తూ ముందుకు సాగుతోంది. ‘బాహుబలి’ మీట్స్ బాలయ్య- అంటూ రూపొందిన ఈ ప్రోమో శనివారం సాయంత్రం విడుదలయింది. ఈ ప్రోమో ఆరంభంలోనే బాలకృష్ణ, ప్రభాస్ ను ఆహ్వానించిన తీరు ఆకట్టుకుంటుంది. “కాశ్యపేయస గోత్రోద్భవస్య ఉప్పలపాటి ప్రభాస్ రాజ్ నామధ్యేయస్య…” అంటూ పిలవడం అక్కడున్నవారినే కాదు, ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ప్రభాస్ తనకు ఇష్టమైన వారిని ‘డార్లింగ్…’ అంటూ పిలవడం అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య ‘సభాముఖంగా అడుగుతున్నా… నన్ను కూడా డార్లింగ్.. అనే పిలవాలి’ అంటూ కోరారు. దానికి ప్రభాస్ ‘అలాగే… డార్లింగ్ సర్…’ అనడంతో వినోదం పండింది.
18 Pages Trailer: అందంగా, ఆసక్తికరంగా ’18 పేజెస్’ చిత్రం ట్రైలర్
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
‘మొన్నెప్పుడో శర్వానంద్ వచ్చాడు… పెళ్ళెప్పుడూ అంటే ప్రభాస్ తరువాత అని చెప్పాడు…మరి నువ్వు…” అని బాలయ్య ప్రశ్నించగానే, “నేను సల్మాన్ ఖాన్ తరువాత అన్నా…” అని ప్రభాస్ సమాధానం చెప్పగానే నవ్వులు పూశాయి. మధ్యలో గోపీచంద్ రావడం, అతనితో “మనవాడు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండని ఫోన్ చేయించాడు… అతనేమో చిన్న లీకిచ్చాడు…” అని బాలయ్య చెప్పగానే, “రాణీ గురించే కద్సార్…” అంటూ గోపీచంద్ అనగానే “రేయ్…” అంటూ ప్రభాస్ కేకేయడం అన్నీ సరదాగా సాగాయి. ఇలా సాగిన వినోదం తరువాత రెబల్ స్టార్ కృష్ణంరాజును ప్రభాస్ స్మరించుకోవడంతో ముగిసింది. ప్రోమోలోనే ఇంతగా అలరిస్తూ సాగుతోన్న ప్రభాస్ తో బాలయ్య ఎపిసోడ్ ఏ తీరున మురిపిస్తుందో చూడాలి. డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. మరి ఆ ఎపిసోడ్ ఏ తీరున దూసుకుపోతుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA&feature=youtu.be
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!