Chiranjeevi V/s Balakrishana: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ వీరిద్దరి మధ్య పోటీ అంటే దక్షిణాది సినిమా అభిమానులందరికీ ఓ ప్రత్యేకమైన ఆసక్తి ! అందులోనూ ఈ ఇద్దరు టాప్ స్టార్స్ పొంగల్ బరిలో పోటీ పడడమంటే మరింత ఆసక్తి పెరుగుతుంది. రాబోయే 2023 సంక్రాంతి సంబరాల్లోనూ చిరంజీవి, బాలకృష్ణ ఢీ కొంటున్నారు. ఇప్పటికి మొత్తం ఎనిమిదిసార్లు సంక్రాంతి సంబరాల్లో ఢీ కొన్న ఈ ఇద్దరు హీరోలు చెరో నాలుగు సార్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించారు. ఇప్పుడు తొమ్మిదోసారి పొంగల్ హంగామాలో చిరు, బాలయ్యల్లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలని ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు సినీజనం సైతం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా జనవరి 12న సందడి చేసేందుకు వస్తున్నారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సంబరం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ లోనూ పలు సెంటిమెంట్స్ సందడి చేస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ హీరోస్ సినిమాలకు సంగీతం సమకూర్చిన థమన్, దేవిశ్రీ ప్రసాద్ నడుమ సైతం ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం వల్ల ఆ దిశగానూ అభిమానుల లెక్కలు సాగుతున్నాయి.
Read also: Delhi Acid Attack: ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొన్న నిందితుడు.. అమెజాన్, ఫ్లిప్‌కార్టుకి DCW నోటీసులు
ఇప్పటికైతే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’దే పైచేయిగా కనిపిస్తోందని మెగాస్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎలాగంటే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోని “బాస్ పార్టీ…” సాంగ్ మూడువారాల క్రితం విడుదలై ఇప్పటికి 25 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే రెండు కోట్ల యాభై లక్షల మంది చూపరులను ఆకర్షించిందీ పాట. దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన ‘బాస్ పార్టీ…’ సాంగ్ మాస్ ను బాగా పట్టేసిందని చెప్పవచ్చు. ఇక ఆ పాట కంటే వారం రోజులు వెనకాల విడుదలైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’లోని “జై బాలయ్యా…” సాంగ్ రెండు వారాలలో 14 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించింది. అంటే ఒక కోటి నలభై లక్షల వ్యూస్ పొందింది. చిరంజీవి ‘బాస్ పార్టీ…’కి, బాలకృష్ణ ‘జై బాలయ్యా…’కు మధ్య వ్యత్యాసం 11 మిలియన్లు (అక్షరాలా ఒక కోటి పది లక్షల వ్యూస్) ఉందన్న మాట! ఈ తీరున బాలయ్య కంటే చిరంజీవిది పైచేయిగా సాగింది.
Read also: Congress Leaders Arrested: కరీంనగర్ లో ఉద్రిక్తత.. బండిసంజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
గతంలో 2020 సంక్రాంతి సంబరాల్లో దేవిశ్రీ ప్రసాద్ బాణీల్లో రూపొందిన మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదలైంది. అందువల్ల ఓపెనింగ్ ఆ సినిమాకు భలేగా కలసి వచ్చింది. అయితే ఆ మరుసటి రోజు అంటే జనవరి 12న వచ్చిన అల్లు అర్జున్ ‘అల…వైకుంఠపురములో’ చిత్రం థమన్ స్వరాలతో ఆడియోలో పై చేయి సాధించింది. తరువాతి రోజుల్లో ‘సరిలేరు…’ను వసూళ్ళ పరంగానూ దాటేసింది. కానీ, ఇప్పటి పరిస్థితి భిన్నంగా ఉంది. థమన్ బాణీల్లో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ ఆడియో పరంగా వెనుకపడగా, దేవిశ్రీ స్వరాల్లో వస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్ తో పరుగు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ గురువారం (డిసెంబర్ 15న) విడుదలయింది. “సుగుణసుందరి…” అంటూ సాగే ఈ పాట విడుదలైన మూడు గంటల్లో దాదాపు మిలియన్ మార్కు చేరుకుంది. ఈ రెండు చిత్రాలు ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన నిర్మాతలు, ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ముందుగా రిలీజ్ చేశారు. ‘వీరయ్య’ సెకండ్ సింగిల్ వచ్చి, ఏ రీతిన అలరిస్తుందో చూడాలని మెగాస్టార్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇవేవీ కావు సంక్రాంతి బరిలో మాదే పైచేయి అవుతుందని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఎవరి ఆశలు ఏ రీతిన నెరవేరతాయో చూడాలి.
Live In Relation: కేరళ శ్రద్ధా వాకర్‌గా సింధు.. యువతిని నరికి చంపిన లవర్