పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా 'అందాల రాక్షసి'తోనే వెండితెరపై వెలిగిన లావణ్య జనం మదిలో ఆ సినిమా టైటిల్ గానే నిలచిపోయింది.
Aatma Bandhuvu: సారథి సంస్థ భాగ్యనగరంలో ‘శ్రీసారథి స్టూడియోస్’ నిర్మించి, అనేక మహత్తరమైన చిత్రాలను తెరకెక్కించింది. అందులో మహానటుడు యన్.టి.రామారావుతో ఈ సంస్థ రెండు సూపర్ హిట్స్ నిర్మించడం, అవి రెండూ శివాజీగణేశన్ తమిళ చిత్రాలకు రీమేక్ కావడం విశేషం! వాటిలో మొదటిది ‘కలసివుంటే కలదుసుఖం’ కాగా, రెండవది ‘ఆత్మబంధువు’. ఈ రెండు చిత్రాలలోనూ సావిత్రి నాయికగా నటించడం మరో విశేషం! ‘కలసివుంటే కలదు సుఖం’కు తమిళ ఒరిజినల్ ‘భాగ పిరివినై’, ‘ఆత్మబంధువు’కు ‘పడిక్కాద మేధై’ మాతృక. […]
Rana Daggubati: యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు. తాత రామానాయుడు పేరునే పెట్టుకున్న రానా ఆయన అడుగుజాడల్లోనే పయనిస్తూ నటన, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ఇక వ్యాఖ్యాతగా, సమర్పకునిగానూ తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ అందుకున్నారు. తమ దగ్గుబాటి ఫ్యామిలీలోనే తన రూటే సెపరేటు అంటున్నారాయన. మరో చెప్పాలంటే వారి ఫ్యామిలీలో 'లక్కీ బోయ్' రానాయే అనీ అనవచ్చు.
Adhi Pinisetty: తండ్రి రవిరాజా పినిశెట్టి రీమేక్స్ లో కింగ్ గా సాగినా, తనయుడు ఆది పినిశెట్టి మాత్రం నటనతోనే రాణించాలని భీష్మించుకున్నాడు. అంతేనా, అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ తనలో ఉన్నాయని నిరూపించుకున్నారు ఆది. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా ఆకట్టుకున్న ఆది ఇకపై కూడా తన తడాఖా చూపిస్తానంటున్నారు.
Shahrukh Khan: ఎంతటి వీరుడైనా, ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుందని అంటారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒకప్పుడు వరుస విజయాలు చూసిన షారుఖ్ ఖాన్, కొన్నేళ్ళుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ కొట్టి చూపించాలని ఆయన తపిస్తున్నారు. నిజానికి షారుఖ్ చూడని విజయాలు లేవు, ఎక్కని ఎత్తులూ లేవు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ఒక కేంద్రంలో ప్రదర్శితమైన చిత్రంగా ఆయన 'దిల్ వాలే…
Victory Venkatesh: ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది నిర్మాతల తనయులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి ఘనవిజయం సాధించిన స్టార్ హీరోగా వెంకటేష్ తనదైన బాణీ పలికించారు. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది నిర్మాతలు తమ కుమార రత్నాలను హీరోలుగా పరిచయం చేయడానికి పరుగులు తీశారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో […]
Ram Charan: "ఎన్నాళ్ళో వేచిన ఉదయం.." అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.
Dilip Kumaమహానటుడు దిలీప్ కుమార్ పేరు వినగానే 'ట్రాజెడీ కింగ్' అన్న ఆయన ట్యాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా 'స్వర్ణయుగం' చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్ నటించిన అనేక చిత్రాలు సంగీతసాహిత్యాల పరంగా ప్రేక్షకుల మదిని దోచాయి.