Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.
యన్టీఆర్ అన్నగా అభిమానించే సత్యనారాయణ, యస్వీ రంగారావును తండ్రిగా ఆరాధించేవారు. తొలి రోజుల్లో యస్వీఆర్ తోకలసి సత్యనారాయణ నటించిన పలు చిత్రాలలో ఆయన నుండి ఏ సన్నివేశంలో ఏ డైలాగ్ ఎలా పలకాలో నేర్చుకున్నానని సత్యనారాయణ చెప్పేవారు.
సత్యనారాయణ హిందీ వారినీ ఆకట్టుకున్నారు. అయితే ఆరంభంలో తెలుగు చిత్రాలను హిందీలో డబ్ చేయగా, వాటి ద్వారా ఉత్తరాది వారికి పరిచయం అయ్యారు సత్యనారాయణ. యన్టీఆర్, అంజలీదేవి నటించిన మహత్తర పౌరాణిక చిత్రం `లవకుశ` హిందీ,బెంగాల్ భాషల్లోనూ అనువాదమై అలరించింది.
Aadi Saikumar: ఈ యేడాది ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోగా ఆది సాయికుమార్ నిలిచారు. ఈ యేడాది ఇప్పటికే ఆది నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. కాగా, డిసెంబర్ 30న ఆది తాజా చిత్రం 'టాప్ గేర్' జనంముందు నిలవనుంది.
తెలుగునాట జానపద చిత్రాలు అనగానే ముందుగా స్ఫురించే పేరు నటరత్న యన్.టి.రామారావుదే! ఆ తరువాతే ఎవరి పేరైనా గుర్తుకు వస్తుంది. యన్టీఆర్ తరువాత ఎక్కువ జానపద చిత్రాలలో హీరోగా నటించిన ఘనత కాంతారావుదే! వారిద్దరూ కలసి అనేక జానపద చిత్రాలలో నటించారు. ఇక కాంతారావు సైతం జానపద కథానాయకునిగా ఊపుమీదున్న రోజుల్లో ఆయన యన్టీఆర్ తో కలసి సమానస్థాయిలో నటించిన జానపదం ‘చిక్కడు-దొరకడు’ అనే చెప్పాలి. శ్రీలక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి […]