Priyanka Chopra: వేలంటైన్స్ డేని తాము బుక్ చేసేసుకున్నామని ప్రియాంక చోప్రా చెప్పేసింది. అది తన భర్త నిక్ జోనాస్ తో కాదు సుమా, స్కాటిష్ యాక్టర్ శామ్ రొనాల్డ్ హ్యూఘన్ తో! విడ్డూరంగా లేదూ అంటారా- ఏం కాదు, ప్రియాంక, శామ్ కలసి నటించిన 'లవ్ ఎగైన్' సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వేలంటైన్స్ డేను ఎంచుకున్నారు వీరు.
Leonardo Dicaprio:'టైటానిక్' చిత్రాన్ని 4కె 3డి ఫార్మాట్ లో రూపొందించి, మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కొత్త సొబగుల 'టైటానిక్' జనం ముందుకు రాబోతోంది.
Mirchi:సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ - డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాతో హిట్ కొట్టిన హీరోకు మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ రావాలంటే టైమ్ పడుతుందని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆ చట్రంలో చిక్కుకున్నవారే! రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన తొలి చిత్రం 'ఛత్రపతి' అప్పట్లో బంపర్ హిట్
NTR: 'తమ నందమూరి నటవంశంలో ఎక్కువ ప్రయోగాలు చేసింది తన అన్న కళ్యాణ్ రామ్ ఒక్కరే' అంటూ ఇటీవల 'అమిగోస్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ యన్టీఆర్ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసింది. నిజానికి నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ చేసినన్ని ప్రయోగాలు బహుశా ప్రపంచంలోనే ఏ నటుడూ చేసి ఉండరు.
Bratuku Teruvu:చదువుకున్న వారికి కూడా ఉద్యోగం దొరకని పరిస్థితులు ఇప్పుడే కాదు డెబ్బై ఏళ్ళ క్రితమే ఉన్నాయి. నిరుద్యోగ సమస్యను వినోదం మాటున రంగరించి, అనేక చిత్రాలు రూపొందాయి. అలాంటి ఓ సినిమా 70 ఏళ్ళ క్రితమే పి.రామకృష్ణ దర్శకత్వంలో 'బ్రతుకు తెరువు' పేరుతో తెరకెక్కింది.
A.M.Ratnam:'ఇంతింతై వటుడింతై...' అన్న చందాన అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి ఎంతో ఎత్తుకు ఎదిగినవారు చిత్రసీమలో పలువురు ఉన్నారు. అలాంటి వారిలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు ప్రముఖ నిర్మాత ఏ.యమ్.రత్నం. ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
Rajashekar:తన తరం కథానాయకుల్లో డాక్టర్ రాజశేఖర్ 'యాంగ్రీ యంగ్ మేన్'గా జేజేలు అందుకున్నారు. ఆయన పేరు చెప్పగానే "అంకుశం, మగాడు, ఆక్రోషం, ఆవేశం" వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ తరువాతే ఆయన మిగిలిన చిత్రాలు మన స్మృతిపథంలో మెదలుతాయి.
Shekar Kammula:సినిమాకు ఓ గ్రామర్ కూర్చిన మహామహులు సైతం 'హ్యూమానిటీ స్టాండ్స్ అబౌ ఆల్" అని పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ఆ సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రేక్షకులను కట్టిపడేసే మానవీయ విలువలను తన కథల్లో చొప్పించడం శేఖర్ బాణీ.